Rajithame : ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ‘రంజితమే’ పాట కొరియోగ్రాఫర్ వెర్షన్



Ranjithame : ఈ సంక్రాంతి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ అయిన తమిళ సినిమా వారిసు. తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన ఈ సినిమాను తెలుగులో వారసుడు పేరుతో విడుదల చేశారు. ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ గా డైరెక్టర్ వంశీపైడి పల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

Ranjithame
Ranjithame

ఇక ఈ సినిమాలోని ‘రంజితమే’ పాట థియేటర్లను షేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. విజయ్‌ – రష్మిక జోడీ వేసిన స్టెప్పులను ఫ్యాన్స్‌ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నారు. మరోవైపు యూట్యూబ్‌లోనూ ఈ పాట 150 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ పాటపై ఇప్పటికే చాలా రీల్స్, కవర్ సాంగ్స్ కూడా వచ్చాయి. ఇక ఏ ఈవెంట్ లో చూసినా ఈ పాటే మార్మోగుతోంది.

కాగా, ఈ పాటకు జానీ మాస్టర్‌ డ్యాన్స్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన బృందంతో కలిసి స్టేజ్‌ దద్దరిల్లిపోయేలా స్టెప్పులేసి.. అక్కడ ఉన్న వారందర్నీ అలరించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘వావ్‌.. సూపర్‌ మాస్టర్‌’ అనకుండా ఉండలేకపోతున్నారు.

ఈటీవీలో ప్రసారమైన ‘ఢీ’ డ్యాన్స్‌ రియాల్టీ షోతో కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ.. ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ వంటి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు నటించిన చిత్రాల కోసం పనిచేశారు. ఆయన కొరియోగ్రఫీ చేసిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ కావడంతో స్టార్‌ కొరియోగ్రాఫర్‌గా పేరు సొంతం చేసుకున్నారు. ఈక్రమంలోనే విజయ్‌ నటించిన గత చిత్రం ‘బీస్ట్’లోని ‘హలమితి హబీబో’కు కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఇప్పుడు మళ్లీ ‘రంజితమే’ పాట కోసం విజయ్‌తో వర్క్‌ చేశారు.

మరోవైపు ఈ సినిమా సక్సెస్ వేడుకలను హైదరాబాద్‌లోని దిల్‌రాజు నివాసంలో జరిగాయి. ఈ వేడుకల్లో హీరో విజయ్‌ సందడి చేశారు. ఇతర చిత్రబృందంతోపాటు దిల్‌రాజు కుటుంబసభ్యులతోనూ ఆయన ఫొటోలు దిగారు. దిల్‌రాజు మనవరాలు ఇషిత ఈ వేడుకల్లో ‘రంజితమే’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దీనిని చూసి మురిసిపోయిన విజయ్‌ ఆ పాపను ఎత్తుకుని ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, రష్మిక ఈ వేడుకల్లో కనిపించలేదు.