Kamal Kamaraju : ఆ పని చేసి పోలీసులకు చిక్కిన టాలీవుడ్ హీరో



టాలీవుడ్ హీరో Kamal Kamaraju క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అనుకోకుండా ఒకరోజు, ఛత్రపతి, గోదావరి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత ఆవకాయ బిర్యానీ సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఈ మూవీ తర్వాత కమల్ కు హీరోగా వరుస అవకాశాలు వచ్చాయి. కలవరమాయే మదిలో, అర్వింద్ 2 చిత్రాలతో అలరించాడు. 

Kamal Kamaraju
Kamal Kamaraj

రీసెంట్ గా కమల్ కామరాజుకు హీరోగా అవకాశాలు రావడం లేదు. అందుకే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయాడు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా కమల్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు చాలా వైరల్ అవుతోంది. పొద్దుపొద్దున్నే తాను పోలీసులకు దొరికిపోయానని కమల్ చేసిన ట్వీట్ తో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. 

అందరికి చెప్తా.. ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా. పొదున్నే ఖాళీ రోడ్ చూసి ఎగ్జైట్ అయి 60లో వెళ్లాల్సిన వాడిని 80లో వెళ్లాను. ఇంత పొద్దున్న సమయంలో కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని పట్టుకుని నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పని తీరు, అడ్వాన్స్‌ టెక్నాలజీ చూసి నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించి ఓవర్‌ స్పీడ్‌గా వెళ్లినందుకు క్షమాపణలు కోరుతున్నా.

మనందరి భద్రత కోసం అలుపెరగకుండా కృషి చేస్తున్న హైదరాబాద్‌ పోలీసులకు ధన్యవాదాలు అని తన పోస్టులో రాసుకొచ్చారు కమల్ కామరాజు. దీంతో పాటు తాను బైక్ మీద వేగంగా వెళ్తున్న ఫొటోను కూడా షేర్‌ చేసి అందరికీ చూపించాడు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల పనితీరు ఎలా ఉందో నగరవాసులకు తెలియజేస్తూ ఆయన పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

ఆవకాయ్‌ బిర్యానీ సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చారు కమల్ కామరాజు. శేఖర్‌ కమ్ముల నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్ అయింది. అనుకోకుండా ఒకరోజు, ఛత్రపతి, గోదావరి, జల్సా, అరవింద్‌ 2, కాటమరాయుడు, అర్జున్‌ రెడ్డి, మహర్షి, వకీల్ సాబ్‌ తదితర సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు కమల్ కామరాజు. వైవిధ్యభరితమైన రోల్స్ చేస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ యాక్టర్.. చివరిగా నాట్యం అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం కుష్బూ భర్త సుందర్ సి నటిస్తోన్న ‘వల్లాన్’ అనే తమిళ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.