శర్వానంద్ రిసెప్షన్ లో రామ్ చరణ్ ధరించిన ఈ చొక్కా ధర ఎంతో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి!టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన పెళ్లి సందడే కనిపిస్తుంది.రీసెంట్ గానే ప్రముఖ హీరో శర్వానంద్ తన బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పేసి ఒక ఇంటి వాడు అవ్వగా, నిన్ననే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది, అయితే నిన్న రామ్ చరణ్ శర్వానంద్ వెడ్డింగ్ రిసెప్షన్ కి వేసుకొచ్చిన తెల్ల చొక్కా ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది.

రామ్ చరణ్
రామ్ చరణ్

తెల్ల చొక్కా చూసేదానికి చాలా సింపుల్ గా ఉంది, మనం కూడా కొనుక్కుందాం అని గూగుల్ లో వెతికిన నెటిజెన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఎందుకంటే ఆ చొక్కా ధర అక్షరాలా 75 వేల రూపాయలట. ఈ చొక్కా పేరు లేవు ‘Loewe’ మెన్స్ షర్ట్ అని ఫ్లిప్ కార్ట్ లేదా,అమెజాన్ లో వెతకండి, వెంటనే దొరుకుంటుంది. బాగా డబ్బులు ఉన్నోళ్లు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, కేవలం రెండు రోజుల్లోనే డెలివరీ అయిపోతుంది.

Sharwanand marriage

రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు, బయట కూడా చాలా స్టైలిష్ గా ఉంటాడు. ఆయన ధరించే కాస్ట్యూమ్స్ యూత్ ని తెగ ఆకర్షిస్తాయి. ఇక ముఖ్యంగా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు మాత్రం అభిమానుల కళ్ళు జిగేలుమనే రేంజ్ డ్రస్సులను వేసుకొస్తూ ఉంటాడు. అందుకే రామ్ చరణ్ ని అందరూ మోస్ట్ స్టైలిష్ హ్యూమన్ బీయింగ్ అని అంటుంటారు.

ram charan upsana sharwanand Reception

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి రామ్ చరణ్ తాత్కాలిక విరామం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సతీమణి ఉపాసన కొణిదెల ఇప్పుడు గర్భం దాల్చింది, అతి త్వరలోనే ఆమెకి డెలివరీ కూడా అవ్వనుంది, ఈ సందర్భంగా రామ్ చరణ్ పక్కనే ఉండి అన్నీ చూసుకోవాలి గనుక షూటింగ్స్ అన్నిటికీ కొంతకాలం విరామం ఇచ్చాడు రామ్ చరణ్.