డబ్బు కోసం అసభ్యకరమైన డ్రెస్ వేసిన అమలాపాల్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు

amala paul


చిత్ర పరిశ్రమలో బాగా క్రేజ్ ఉన్న కథానాయికల్లో అమలాపాల్ కూడా ఒకరు. ఆమె కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం భాషలలో నటించి అందరినీ మెప్పించింది. ఎలాంటి చిత్రమైన తన పాత్రకు ప్రాధాన్యం ఉంది అని అనిపిస్తే చాలు ఆమె వెంటనే ఆ చిత్రానికి ఓకే చెప్పేస్తుంది. ఆ తరహాలో వచ్చిన ‘ఆమె’ చిత్రంలో అమలాపాల్ చేసిన సీన్ల వల్ల ఆమె చాలా ట్రోల్స్ కు గురైంది. ఇటీవల మళ్ళీ అమలాపాల్ మరోసారి విమర్శలను ఎదురుకుంటుంది. సామాజిక మాధ్యమంలో ప్రజలందరూ డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తావా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అమలా పాల్
అమలా పాల్

ఇంతకీ అమలాపాల్ ఏం చేసిందట.. ఆమె ఇటీవల గ్యాంబ్లింగ్ క్రీడ అయిన క్యాసినో బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ ఆ కంపెనీ పార్టీలో పాల్గొంది. సదరు క్యాసినో సంస్థ ప్రమోషన్స్ కోసం మోడల్స్ ని, కొందరు నటుల్ని ఎంపిక చేసుకున్నారు. తమ బ్రాండ్ ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి భారీ మొత్తంలో ముడుతుంది. అమలాపాల్ అత్యంత దారుణంగా, వల్గర్ గా ఉన్న ఎల్లో డ్రెస్ లో ఈ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ మీ క్యాసినో ఆడుతున్న దృశ్యాలు, ఫుల్ మూడ్ లో అసభ్యంగా చిందులేస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆమె ధరించిన డ్రెస్ అయితే ఒకవైపు థైస్ మొత్తం కనిపించేలా ఉంది. పైగా విచితమైన గెటప్ లో అమలాపాల్ అసభ్యంగా ఉంది. దీనితో నెటిజన్లు ఆమె గెటప్ పై కూడా ట్రోల్ చేస్తున్నారు.సంపాదన కోసం ఇలాంటి మార్గాలు ఎంచుకోవాలా అని ఆమెపై పోస్ట్ లు పెడుతున్నారు. ఏది ఏమైనా అమలాపాల్ మరోసారి నెటిజన్లకు టార్గెట్ గా మారింది. ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.