బయట కూడా ఐటెం గర్ల్ గా మారిన సమంత.. ఆఖరికి అక్కడ కూడా ఊ అంటావా పాటకు డ్యాన్స్ వేసిందిగా

- Advertisement -

పుష్ప సినిమాలోని ఊ అంటావా పాట ఏ ముహూర్తాన విడుదల అయిందో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే పాట మార్మోగిపోతోంది.చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ సినిమా విడుదల అయి నేటికి సంవత్సరం అవుతున్నా కూడా ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది అంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు.అంతేకాకుండా ఈ పాటలో సమంత స్టెప్పులను కూడా ఇరగదీసింది.

సమంత
సమంత

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటను రీ క్రియేట్ చేశారు. పుష్ప సినిమాకు అంత క్రేజ్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ, అందులో మొదటిది మాత్రం ఈ పాటే అని చెప్పచ్చు.అంతేకాకుండా ఈ పాటను పాడిన సింగర్ ఇంద్రావతి చౌహాన్ కూడా మొదటి పాట తోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సమంత ఆ పాటకు స్టెప్పులను ఇరగదీస్తూ, ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇంతవరకు బానే ఉన్నా సమంత ఈ పాట మూలంగా స్టార్ హీరోయిన్ నుంచి ఐటెం గర్ల్ అనే ముద్ర పడిపోయింది. ఎక్కడకు వెళ్లినా ఎంతమందిలో ఉన్నా ఈ పాటకు డ్యాన్స్ వేయాలంటూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా సమంత నటిస్తోన్న వెబ్ సిరీస్ సిటడెల్ షూటింగ్ సెర్బియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ విరామ సమయంలో పబ్ వెళ్తే అక్కడక కూడా ఈ పాటకు డ్యాన్స్ వేయాలంటూ కేకలు వేశారు. దీంతో సమంత అందరిలో ఓ ఐటెం గర్ల్ లాగా డ్యాన్స్ చేసింది. ఇది చూసిన అభిమానులు స్టార్ హీరోయిన్ నుంచి ఐటెం గర్ల్ అయిపోయావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here