Prabhas : నడవలేని స్థితిలో ప్రభాస్.. మరోసారి సర్జరీ చేస్తేగానీ చెప్పలేమంటున్న డాక్టర్లు..!

- Advertisement -

Prabhas మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రం ‘కల్కి’. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్‌ అశ్విన్‌ విజన్‌ను తెరపై చూసేందుకు ఆడియన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని డిసప్పాయింట్‌ చేసే ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న కల్కి సినిమా చిత్రీకరణకు కాస్తా బ్రేక్‌ పడేలా ఉందట. దానికి కారణం ప్రభాస్‌ అని తెలుస్తోంది. కాగా ప్రభాస్‌ కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగానే ‘సలార్‌’ మూవీ ప్రమోషన్స్‌లో కూడా యాక్టివ్‌గా కనిపించలేదు. ఒక్క రాజమౌళి ఇంటర్య్వూతో సరిపెట్టాడు.

Prabhas
Prabhas

దీంతో ‘సలార్‌’ ప్రమోషన్స్‌లో ప్రభాస్‌ పెద్దగా కనిపించకపోవడంతో ఏమైందా అని అంతా ఆరా తీయగా ఓ వార్త బయటకు వినిపించింది. ప్రభాస్‌ మోకాలి సర్జరీ కోసం మరోసారి విదేశాలకు వెళ్లబోతున్నాడట. అయితే ‘బాహుబలి’ మూవీ షూటింగ్‌ సమయంలో యాక్షన్స్‌ సీన్స్‌ చేస్తుండగా ప్రభాస్‌కు ఈ మోకాలి నొప్పి సమస్య మొదలైంది. ఈ నొప్పితోనే ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’, ‘అదిపురుష్‌’ సినిమా షూటింగ్స్‌ కంప్లీట్‌ చేశాడు. ‘ఆదిపురుష్‌’ అనంతరం ప్రభాస్‌కు ఈ సమస్య తీవ్రమైందట.

- Advertisement -

మూవీ ప్రమోషన్స్‌లోనూ ప్రభాస్‌ మోకాలి నొప్పితో బాధపడటం చూశాం. దీంతో ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ అవ్వగానే ‘డార్లింగ్’ యూరప్‌ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. అక్కడే నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ప్రభాస్‌.. బర్త్‌ డే వేడుక కూడా అక్కడే జరిగింది. అనంతరం ఇండియాకు తిరిగి రాగానే సలార్‌, కల్కి 2829 AD షూటింగ్‌లో పాల్గొన్నాడు.

Prabhas Updates

అంతేకాదు మారుతి ‘రాజా సాబ్‌’ సినిమా షూటింగ్‌ను కూడా కంప్లీట్‌ చేశాడు. ఇలా నిరంతరాయంగా షూటింగ్‌లో పాల్గొనడంతో ప్రభాస్‌ మోకాలి నొప్పి మళ్లీ తిరగపడిందట. మళ్లీ సర్జరీ అవసరం చేయాలని వైద్యులు సూచించారని ఫిలిం దూనియాలో ఇన్‌సైడ్‌ టాక్‌. డాక్టర్స్‌ సూచన మేరకు ప్రభాస్‌ మళ్లీ విదేశాలకు వెళ్లనున్నారంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ. ప్రభాస్‌ మళ్లీ విదేశాలకు వెళ్లబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here