Ravi Teja : ‘బాహుబలి’ సినిమాలో రవితేజ మిస్ చేసుకున పాత్ర అదేనా..? చేసుంటే వేరే లెవెల్ ఉండేది!

- Advertisement -

Ravi Teja : తెలుగు చలన చిత్ర పరిశ్రమని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన చిత్రం రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’. మగధీర సినిమాతో మొట్టమొదటిసారి మన తెలుగు సినిమా గురించి ఇండియా మొత్తం మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి. ఆ సినిమా తర్వాత అంత కంటే భారీ బడ్జెట్ తో, అంత కంటే రిచ్ గా సినిమా తియ్యాలని కసితో బాహుబలి కథని సిద్ధం చేయించాడు.

Ravi Teja
Ravi Teja

అలా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ‘బాహుబలి 2’ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, ఇప్పటికి ఎవ్వరూ దరిదాపుల్లోకి రాలేని రికార్డు గా నిల్చింది. ఇదంతా పక్కన పెడితే బాహుబలి పార్ట్ 1 లో డైరెక్టర్ రాజమౌళి రవితేజ కోసం ఒక అతిథి పాత్ర రాసాడట.

Ravi Teja rajamouli

ఈ సినిమా ప్రారంభం లో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పక్క రాజ్యం నుండి మాహిష్మతి కి వచ్చి కత్తులను సరఫరా కాంట్రాక్టు ని తీసుకొస్తాడు. అప్పుడు కట్టప్ప క్షమించండి ప్రభు, ఈ కత్తులు మా చేతి వేగాన్ని తట్టుకోలేవు అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చిన్న కత్తి యుద్ధం జరుగుతుంది. ఈ సన్నివేశం లో కిచ్చా సుదీప్ పాత్ర కోసం ముందుగా మాస్ మహారాజ రవితేజ ని అనుకున్నాడట డైరెక్టర్ రాజమౌళి.

- Advertisement -
Ravi Teja

గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు కానీ, మర్యాదరామన్న సినిమాలోని సైకిల్ పాత్రకి రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తాడు. అలా ఈ సినిమాలో కూడా ఈ చిన్న గెస్ట్ రోల్ చెయ్యమని రిక్వెస్ట్ చేసాడట రాజమౌళి, కానీ అప్పటికే చేతినిండా సినిమాలతో బిజీ గా ఉన్న ఆయన ఈ ప్రాజెక్ట్ ని చెయ్యలేకపోయాడట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here