Vishwak Sen : ఎన్టీఆర్‌, ప్రభాస్‎లను ఫాలో అవుతున్న మాస్ కా దాస్.. తన నెక్ట్స్ సినిమాలో కూడా ?

- Advertisement -


Vishwak Sen : టాలీవుడ్‌లో చాలా మంది స్టార్ హీరోహీరోయిన్లు అందరూ తమకంటూ ఓ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసమే తెగ కష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ కూడా తనదైన రీతిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఈ నేప‌థ్యంలో విశ్వక్ సేన్ చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీసు వద్ద మంచి విజయాలను సాధించడంతో అతడికి క్రేజ్ పెరిగింది. బేబీ సినిమా టైమ్లో నటించిన విశ్వక్ సేన్ వ్యవహరించిన తీరుకు విమర్శకుల నుంచి చాలా నెగిటివ్ కామెంట్స్ అందుకున్నాడు. అయినా ఎవరికీ బెదరకుండా తాను సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

Vishwak Sen
Vishwak Sen

తాజాగా ‘మంగళవారం’ చిత్ర సక్సెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్సేన్ ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో తనదైన శైలిలో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో రగ్గడ్ పర్సన్ గా చాలా రఫ్ క్యారెక్టర్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా లీడ్ రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ వరుస తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Devara

ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో విలన్‌గా నటించిన సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. అదే విధంగా విశ్వక్సేన్ సినిమాలో సైఫ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. వచ్చే ఏడాది విడుదలయ్యే అన్ని పెద్ద సినిమాల్లో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించబోతున్నాడనే వార్త వైరల్ అవుతుంది. దీంతో ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాల్లో విలన్ గా చేసిన సైఫ్ అలీఖాన్ తన సినిమాలో విశ్వక్ ను విలన్ గా తీసుకుంటున్నాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here