SS Rajamouli తో సినిమా చెయ్యాలని ఏ హీరోకి అయినా ఉంటుంది. అప్పటి వరకు తమకు ఉన్న ఇమేజి ని పదింతలు చేసుకోవాలంటే కచ్చితంగా రాజమౌళి తో సినిమా చెయ్యాలి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సైతం ఆయనతో సినిమా చెయ్యడానికి పరితపిస్తూ ఉంటారు. అయితే రాజమౌళి తో సినిమా అనుకున్నంత సులువు కాదు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఆయన చెప్పినట్టు వినాల్సిందే. లేకపోతే అసలు ఊరుకోడు. ఆయనతో సినిమా షూటింగ్ జరిగే రోజుల్లో మరో సినిమా షూటింగ్ కి వెళ్ళకూడదు.

ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు ఆయన చెప్పింది చెప్పినట్టుగానే చేస్తూ వచ్చారు. వారానికి ఒక సినిమా షూటింగ్ లో ఉండే రవితేజ లాంటి హీరో కూడా, రాజమౌళి తో ‘విక్రమార్కుడు’ సినిమా చేసే సమయం లో మరో సినిమాకి కమిట్ అవ్వలేదు. అలా ఉంటుంది మరి రాజమౌళి, ఇప్పుడు త్వరలో ఆయన మహేష్ బాబు తో సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి రాజమౌళి ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే మహేష్ బాబు పై లుక్ టెస్ట్స్ చేసి, ఒక లుక్ ని ఫైనల్ చెయ్యబోతున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ చిత్రం లో ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని లుక్ లో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడట. మార్చి నెల నుండి ఆయన ఆ లుక్ లోనే ఉంటాడట.

అందుకే రాజమౌళి ఎట్టి పరిస్థితిలో కూడా లుక్ ని బయట రానివ్వకూడదు అని మహేష్ బాబు కి చాలా సీరియస్ గా చెప్పాడట. ఏదైనా విహార యాత్రకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడే వెళ్లి వచ్చేయండి. మార్చి నెల నుండి మీరు అసలు మీడియా కి కనిపించకూడదు, ఎలాంటి యాడ్ షూట్ లో కూడా పాల్గొనకూడదు, కనీసం ఫోటో కూడా దిగేందుకు వీలు లేదు అని చెప్పాడట. దీనికి మహేష్ బాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.