Unstoppable 2 with NBK : ప్రభాస్.. గోపిచంద్ అల్లరి మాములుగా లేదుగా..వీడియో రిలీజ్..

- Advertisement -

Unstoppable 2 with NBK : నందమూరి నట సింహం బాలయ్య యాంకర్గా చేస్తున్న ఏకైక షో అన్ స్టాపబుల్ గురించి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది..ఈ షోకు సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ సీజన్ కంటే.. మరింత ఎక్కువ రెస్పాన్స్ అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అన్ స్టాపబుల్ షో. ఇటీవల ఇందులోకి ప్రభాస్.. తన స్నేహితుడు గోపిచంద్ వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి సంబంధించిన రెండు ఎపిసోడ్స్ ప్రోమోలు వ్యూస్ రికార్డ్స్ బద్దలు కొట్టాయి.

Unstoppable 2 with NBK
Unstoppable 2 with NBK

డార్లింగ్ చిత్రాల కోసం వేయి కళ్లతో ఎదురుచూసే అభిమానులకు ఈ ఎపిసోడ్స్ తో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఆన్ స్టాపబుల్ మేకర్స్. ఇందులో తన అప్డేట్స్ కంటే ఎక్కువగా ప్రభాస్ ప్రేమ, పెళ్లి గురించి చర్చ జరిగింది. ఇక తాజాగా ఈ ఎపిసోడ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది ఆహా. ఇది ఇలా వుండగా..డార్లింగ్ ప్రభాస్ ఇన్ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ డార్లింగ్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది ఆహా. అందులో స్టేజ్ పైనే కాకుండా.. తెర వెనక బాలయ్యతో డార్లింగ్.. గోపిచంద్ చేసిన అల్లరి చూపించింది. అందులో బాలయ్య.,. మీట్ ది రియల్ సైడ్ అఫ్ బాలయ్య అంటూ ప్రభాస్ కు చెబుతుండగా.. అయ్యో నాకు తెలుసు సార్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు డార్లింగ్.

Unstoppable 2 with NBK

అదే విధంగా.. ఆహా టీం తనకు ఇంకో కుటుంబం అంటూ చెప్పుకొచ్చాడు బాలయ్య.. బాలయ్యతో సరదాగా గడిపిన వారిద్దరు అక్కడున్న అభిమానులకు సెల్ఫీ ఫోజులిచ్చాడు. అలాగే వారితో ముచ్చటించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్న ఈ వీడియో జానాలను తెగ ఆకట్టుకుంటుంధి.. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాల తో పాటు మారుతి సినిమా చేస్తున్నారు..ఈ సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here