Radhika :అట్లుంటది సోషల్ మీడియాలో మన రాధిక గ్లామర్ షో

- Advertisement -

‘ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు’.. ఈ ఒక్క డైలాగ్‌తో యావత్ తెలుగు యువకుల మనసు కొల్లగొట్టేసింది హీరోయిన్ నేహా శెట్టి. డీజే టిల్లులో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. మూవీలో బ్లాక్ శారీలో తన అందాలను.. నటనను చూపిస్తూ యువకులను ఫిదా చేసేసింది. ఈ సినిమాతో నేహా పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.

neha sharma

ఒక్క డైలాగ్‌తో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సొంతం చేసుకుంది రాధిక.. అదేనండి మన నేహా శెట్టి. పూరి జగన్నాథ్ రూపొందించిన మెహబూబా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నేహా శెట్టి.. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో రాధికగా నటించి సూపర్‌గా పాపులర్ అయింది. ఈ మూవీలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డతో నేహా చేసినా రొమాన్స్ చూసి పిచ్చెక్కిపోయారు యూత్ ఆడియన్స్.

- Advertisement -
neha sharma

ఈ మూవీతో యూత్‌లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇంటర్నెట్‌లో తన గ్లామర్ షోతో హీటెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు కిక్ ఇస్తోంది. రీసెంట్‌గా ఈ క్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Neha Sharma

నేహా శెట్టి లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రాధిక మెస్మరైజింగ్ పోజులు చూసి మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొందరైతే ఈ ఫొటోలకు లైకులు, షేర్లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Neha Sharma

డీజే టిల్లు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ కూడా రూపొందిస్తున్నారు. అయితే ఈ మూవీలోనూ నేహా అందాలు చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ఫిక్సయిన ఆడియన్స్‌కు ఈ బ్యూటీ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఆ మూవీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌ని డిసప్పాయింట్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here