‘ఆదిపురుష్’ మూవీ ఫుల్ రివ్యూ.. రాముడి పేరు ఎత్తకుండా రామాయణం ఎలా తీశారండి బాబోయ్!

- Advertisement -

ఇండియా మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన చిత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’. రామాయణం గాదని మన చిన్నతనం లో ఎన్టీఆర్ లాంటి మహానుభావులు చెయ్యడమే మనం చూసాము, మన తరం లో కూడా చాలా మంది చేసారు కానీ , ఇలా భారీ బడ్జెట్ తో, అతి పెద్ద సూపర్ స్టార్ తో , సరికొత్త టెక్నాలజీ ని ఉపదయోగించి మాత్రం ఎవ్వరూ చెయ్యలేదు. అందుకే ఈ సినిమా పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో అంతలా అంచనాలు పెరిగాయి.

టీజర్ విడుదల అయ్యినప్పుడు కార్టూన్ సినిమా అని చాలా మంది ట్రోల్ చేసారు కానీ, ఎప్పుడైతే ట్రైలర్ మరియు పాటలు విడుదల అయ్యాయో, అప్పటి నుండి ఈ చిత్రం పై హైప్ మామూలు రేంజ్ లో రాలేదు. మరి అంత అంచనాలతో నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా , అభిమానుల అంచనాలను అందుకుందో లేదో ఈ రివ్యూ లో చూద్దాము.

ఆదిపురుష్ రివ్యూ
ఆదిపురుష్ రివ్యూ

కథ :

- Advertisement -

దశరథ మహారాజు (ప్రభాస్ ) వృద్దాప్యం మీదకి వస్తుండడం తో తన పెద్ద కొడుకు రాఘవ్ (ప్రభాస్) కి అయోధ్య నగర మహారాజు గా పట్టాభిషేకం చెయ్యాలని అనుకుంటాడు. కానీ రాఘవ్ సవతి తల్లి కైకేయి అందుకు ఒప్పుకోదు. తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని, అలాగే రాఘవ్ ని 14 సంవత్సరాలు వనవాసం చెయ్యాలని పట్టుబడుతుంది.అప్పుడు దశరథ మహారాజు ఇచ్చిన మాట కోసం రాఘవ్ తన సతీమణి జానకి (కృతి సనన్) తో కలిసి వనవాసం కి వెళ్తాడు.

అక్కడ కొన్నాళ్ళు గడిపిన తర్వాత లంకేశ్ (సైఫ్ అలీ ఖాన్) చెల్లెలు సూర్పనక్క లక్ష్మణ్ ని వరిస్తుంది, కానీ లక్ష్మణ్ కి ఇష్టం లేదు, దాంతో ఆమె దాడి చేసే ప్రయత్నం చెయ్యగా, లక్ష్మణ్ సూర్పనక్క ముక్కు కోసేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లంకేశ్ సీతని భిక్షువు రూపం లో వచ్చి అపహరించుకొని లంకకు తీసుకెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు సీత ని తిరిగి తీసుకొని రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, అతనికి హనుమంతుడు మరియు వానర సైన్యం ఎలాంటి సహాయ సహకారాలు అందించారు అనేది వెండితెర మీద చూసుకోవాల్సిందే.

Adipurush Review

విశ్లేషణ :

ఈ చిత్రం ప్రారంభమే చాలా గొప్పగా ఉంటుంది, విజువల్స్ పరంగా చాలా రిచ్ గా ఉంటుంది, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలు 3D ఎఫెక్ట్స్ అనుభూతి అద్భుతంగా అనిపించింది. ఆడియన్స్ కచ్చితంగా థ్రిల్ కి గురి అవుతారు. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా అద్భుతమైన మ్యూజిక్ తో చాలా స్మూత్ గా సాగిపోతుంది ఫస్ట్ హాఫ్. కానీ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో VFX చాలా నాసిరకంగా అనిపించాయి. అయ్యినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటట్టు అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ఓం రౌత్.

Adipurush

కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఫ్లాట్ గా సాగిపోతుంది. ముఖ్యంగా రావణాసురిడి పది తలలను చూపించిన విధానము చూస్తే బండ బూతులు తిట్టేసారు. అంత వరస్ట్ గా చూపించాడు డైరెక్టర్ ఓం రౌత్ . మరో విశేషం ఏమిటంటే రామ నామం ఒక్కసారి అయిన వినిపిస్తుందేమో అని ఆశగా ఎదురు చూసిన ఆడియన్స్ కి భంగపాటు ఎదురైంది. రాముడిని రాఘవ్ గా, సీత ని జానకి గా మరియు రావణుడిని లంకేశ్ గా పిలుస్తూ ఉంటాయి మిగతా క్యారెక్టర్స్. ఇది చాలా కోపం తెప్పించే విషయం అనే చెప్పాలి.

ఎందుకు శ్రీ రాముడి కి ఎన్ని పేర్లు అయినా ఉండొచ్చు కానీ, ఆయన భక్తులు చివరికి శ్రీ రామ్ అని పిలుస్తారు. కానీ ఈ చిత్రం లో రామ నామం లేకుండానే కానిచ్చేశాడు డైరెక్టర్ ఓం రౌత్. ఇక క్లైమాక్స్ ఫైట్ చాలా అద్వానంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఔట్పుట్ రాలేదు. ఇక ఈ సినిమాని కాపాడింది ఏదైనా ఉందా అంటే అది మ్యూజిక్ అనే చెప్పాలి , పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్స్ లో ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక ఈ చిత్రం లో లీడ్ తారాగణం ప్రభాస్ , కృతి సనన్ మరియు సైఫ్ అలీ ఖాన్ అద్భుతంగా నటించారు.

చివరి మాట :

ఒక్క మాటలో చెప్పాలంటే VFX పై అంచనాలు పెట్టుకోకుండా కేవలం స్క్రీన్ ప్లే పరంగా చూస్తే డైరెక్టర్ టేకింగ్ అదిరిపోయింది అనే చెప్పాలి. కానీ సెకండ్ హాఫ్ ని ఇంకా మంచిగా తీసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా ఈ చిత్రాన్ని యావరేజి అని చెప్పొచ్చు.

నటీనటులు : ప్రభాస్ , కృతి సనన్ , సైఫ్ అలీ ఖాన్, దేవ్ దత్త నాగే, సన్నీ సింగ్ తదితరులు
దర్శకత్వం : ఓం రౌత్
సంగీతం : సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ

రేటింగ్ : 2.5 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here