శ్రీలంకలో జాలీగా హాలిడే ఎంజాయ్ చేస్తున్న బుట్టబొమ్మ.. పూజా హెగ్డే ఫొటోలు వైరల్

- Advertisement -

పూజా హెగ్డే ప్రస్తుతం హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. ఈ బ్యూటీ శ్రీలంకలో జాలీగా తన వెకేషన్ను గడుపుతోంది. దానికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. శ్రీలంక ఈ భామ తన ఫేవరెట్ ఫుడ్ తింటూ ఫొటోలకు పోజులిస్తోంది. ఓ కామన్ మ్యాన్లా అక్కడి వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. తనకు నచ్చిన క్యాజువల్ వేర్లో జాలీగా విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతోంది కాస్త మంచి స్పాడ్ కనిపించగానే ఫొటోకు పోజులిస్తోంది. వాటిని కాస్త తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది.

పూజా హెగ్డే
పూజా హెగ్డే

శ్రీలంక వెకేషన్లో ఉన్న బుట్టబొమ్మ తాజాగా తన ఫొటోలను షేర్ చేసింది. క్యాజువల్ ఔట్ఫిట్స్లో చాలా క్యూట్గా కనిపిస్తోంది పూజ. అక్కడి స్ట్రీట్ ఫుడ్ను ఎంజాయ్ చేస్తూ హాలిడే టైంలో ఫిట్నెస్, డైటింగ్ను కాస్త పక్కన బెట్టేసింది. ఇక విదేశీ వీధుల్లో షాపింగ్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ బ్యూటీ ఫొటోలు చూస్తుంటే సోలోగానే ట్రిప్కు వెళ్లినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పూజ వెకేషన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే హాట్ హాట్ సమ్మర్లో హీరోయిన్లంతా కూల్ కూల్గా ఉండేందుకు మాల్దీవ్స్ వంటి బీచ్లున్న ప్రదేశాలకు వెకేషన్కు వెళ్తుంటే పూజ మాత్రం శ్రీలంకకు వెళ్లడంపై నెటిజన్లు కాస్త భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. పూజ గత కొంతకాలంగా ఫ్లాప్లతో సతమతమవుతోందని.. ఆ స్ట్రెస్ నుంచి ఉపశమనం పొందడానికి కాస్త ప్రకృతిలో సేద తీరుతోందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

మరికొందరేమో పూజకు పచ్చదనం అంటే ఇష్టమని అందుకే ప్రకృతిలో హాయిగా సేదతీరుతోందని అంటున్నారు. ఏదేమైనా పూజ వెకేషన్ ఫొటోలు చాలా క్యూట్గా.. బ్యూటీఫుల్గా ఉన్నాయంటూ హార్ట్ ఎమోజీస్తో తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు.

పూజా హెగ్డే సినిమాల సంగతికి వస్తే ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్లో మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్లోనూ అడపదడపా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవలే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ సరసన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించింది. ఆ చిత్రం రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here