Salman Khan : 32 ఏళ్ల తర్వాత తన ‘లవ్’ హీరోయిన్​తో సల్మాన్ ఖాన్​.. మ్యాజిక్ రిపీట్ కానుందా..?

- Advertisement -

‘సాథియా తూనే క్యా కియా’ అంటూ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్- బ్యూటిఫుల్ హీరోయిన్ రేవతి పాడుకుని దాదాపు 32 ఏళ్లవుతోంది. మూడు దశాబ్ధాల తర్వాత ఈ జంట ఇప్పుడు మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతంది. టైగర్-3లో ఈ మూవీ ఓ కీలక పాత్రలో నటించనుందని న్యూస్ వైరల్ అవుతోంది. యష్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్​టైనర్ టైగర్-3లో Salman Khan – రేవతి నటించడం పట్ల ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత తమ ఫేవరెట్ జోడీ కలిసి నటించనుండటంతో పండుగ చేసుకుంటున్నారు.

Salman Khan
Salman Khan

టైగర్-3 మూవీలో రేవతి పాత్ర గురించి జర్నలిస్ట్ హిమేష్ మన్కడ్ ట్విటర్​లో షేర్ చేశారు.  #ప్రేమ తర్వాత 32 సంవత్సరాలకు సల్మాన్ ఖాన్ – రేవతి టైగర్ 3 కోసం మళ్లీ కలిశారని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి రేవతి పాత్ర వివరాలు గోప్యంగా ఉంచారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ టైగర్ 3.. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత టైగర్ సిరీస్​లో వస్తోన్న మూడో సినిమా ఇది. సల్మాన్- కత్రినా కైఫ్ – రణవీర్ షోరే కాంబో రిపీట్ కావడం ఆసక్తిని పెంచుతోంది. ఇందులో రేవతితో పాటు ఇమ్రాన్ హష్మీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రను కూడా పోషించనున్నారు.

 

- Advertisement -

Salman Khan

లవ్ తర్వాత సల్మాన్ – రేవతి స్క్రీన్ ని షేర్ చేసుకోకపోయినా 2004లో రేవతి దర్శకత్వం వహించిన `ఫిర్ మిలేంగే`లో సల్మాన్ నటించారు. అభిషేక్ బచ్చన్- శిల్పాశెట్టి కూడా నటించిన ఈ చిత్రం ఎయిడ్స్ అవగాహన గురించి స్పెషల్ కథనంతో తెరకెక్కింది. నటిగా రేవతి చివరిగా గత నెలలో విడుదలైన ఎమోషనల్ డ్రామా మూవీ `ఏ జిందగీ`లో కనిపించింది.

మరోవైపు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు టైగర్-3 మూవీ చేస్తూనే మరోవైపు కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే మూవీలో నటిస్తున్నాడు. మరోవైపు బిగ్​బాస్ షోకు హోస్ట్​గా వ్యవహరిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here