Unstoppable with NBK : బాలయ్య షోలో పవన్ కళ్యాణ్..నిజమైతే ఫ్యాన్స్ కు పూనకాలే..Unstoppable with NBK : టాలివుడ్ హీరో నటసింహం నందమూరి బాలయ్య షోకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు ఆహా నిర్వహిస్తున్న టాక్ షో Unstoppable with NBK కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.బాలయ్య లాంటి సీనియర్ హీరో ఇలా సరదాగా కనిపిస్తూ జనాలను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ వన్ ను సక్సెస్ ఫుల్ గా, ఎటువంటి రుమార్స్ లేకుండా కంప్లీట్ చేశారు బాలయ్య..

ఇప్పుడు సీజన్ 2కు హోస్ట్ గా చేస్తున్నారు. డబుల్ ఎనర్జీతో కుర్రహీరోలను ముప్పుతిప్పలు పెడుతున్నారు బాలకృష్ణ. ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2కు యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ, శర్వానంద్, అడవి శేష్..గెస్ట్ లు గా హాజరయ్యారు. ఆ తర్వాత ఎపిసోడ్ కు రాజకీయ నేతలు నారా చంద్రబాబు, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, గోపీచంద్ రీసెంట్ ఎపిసోడ్ కు గెస్ట్ లుగా హాజరయ్యారు. ప్రభాస్ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉండగా.. అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది.అంతేకాదు సోషల్ మీడియాలో ప్రచారం కూడా జోరుగా జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి పవన్ బాలయ్య షోకు రానున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే అభిమానులకు పండగే.. పవన్, బాలయ్యను ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే సినీ ప్రేక్షకులకు పూనకాలే..

Unstoppable with NBK
Pawan kalyan with balayya show

మొన్నామధ్య బాలయ్య ఇదే షోలో త్రివిక్రంతో ఫోన్ మాట్లాడుతూ.. నా షోకి ఎవరితోరావాలో తెలుసుగా అంటూ హింట్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 కి రావడానికి పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారని కూడా తెలుస్తోంది. అయితే ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కు పవన్ , త్రివిక్రమ్ హాజరవుతారని తెలుస్తోంది. పవన్ ఎపిసోడ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 ముగుస్తుందని తెలుస్తుంది. ]

ఇక పవన్ వస్తే బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని నిజాలు బయట పెడతారు అనే ఆసక్తి ఇప్పటి నుంచే కనిపిస్తుంది. పవన్ ఏవిధంగా సమాధానం చెప్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే పవన్ ఎపిసోడ్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఏంజరుగుతుందో…బాలయ్య వీర సింహారెడ్డి తర్వాత, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది..ఆ రెండు సినిమాల కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.