Pawan Kalyan : ఇరవై ఏళ్ల సీన్ రిపీట్.. కత్తి పట్టిన పవన్ కళ్యాణ్.. ఫ్యాన్స్ ఫిదా..

pawan kalyan


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్నారు.. ఇప్పుడు గ్యాప్ లేకుండా వరుస సినిమాలను చేస్తున్నారు. తన తొలి చిత్రం అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి నుంచి ఇప్పుడు నటిస్తున్న హరిహర వీరమల్లు దాకా చాలా సినిమాల్లో ఎక్కడో ఒక చోట తన మార్షల్‌ ఆర్ట్స్‌ ట్యాలెంట్‌ను చూపిస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు పవర్‌ స్టార్‌. ‘రెండు దశాబ్దాల తర్వాత నేను నా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌లోకి వచ్చాను’ అని తన పోస్టుకు క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

కత్తిపట్టిన కత్తిలా ఉన్నాడంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ఈ ఫొటోను నెట్టింట్లో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. కాగా పవన్ నటిస్తన్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్ చారిత్రాత్మక కథాంశంతో ఈ మూవిను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌ బందిపోటుగా కనిపిస్తారని ప్రచారం జరగుతోంది.ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పవన్‌ స్టిల్స్‌, ఫొటోలు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.. అంతే కాదు లైకులు షేర్స్ తో ట్రెండ్ అవుతుంది..

pawan kalyan
pawan kalyan

హరిహర వీరమల్లు లో కథానుగుణంగా వీరమల్లు పాత్రకు మార్షల్ ఆర్ట్స్ విద్య అవసరమైనందున.. దీనికోసం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు పవన్. ఈ ద్వారా తనలోని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని మరోసారి చూపించబోతున్నారు పవన్‌. అందుకు తగ్గట్లే ట్రైనర్‌తో కలిసి పవన్‌ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటోంది చిత్రబృందం. కాగా 17వ శతాబ్దంలో మొగలుల కాలం నాటి కథతో హరిహర వీరమల్లు తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇస్మార్ట్‌ భామ నిధి అగర్వాల్ పవన్‌ సరసన నటించనుంది.

అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌, నర్గీస్‌ ఫక్రీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన అన్నీ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందొ చూడాలి…ఏది ఏమైనా కూడా పవన్ డేర్ ను మెచ్చుకోవాల్సిందే..ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరో వైపు సినిమాలు..నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..

Tags: