టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్, పవర్ కపుల్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది మహేశ్ బాబు- నమ్రతా శిరోద్కర్ Namrata Shirodkar జంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇద్దరు పిల్లలతో హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. ఓవైపు మహేశ్ బాబు సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, బిజినెస్ పనుల్లో బిజీబిజీగా గడుపుతోంటే.. మరోవైపు నమ్రత ఇంటి బాధ్యతలు, పిల్లల పాలన, సామాజిక కార్యక్రమాలు, తాము దత్తత తీసుకున్న గ్రామాల బాధ్యతలు చూసుకుంటోంది.
ఈ ఇద్దరు తమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. తరచూ పిల్లలతో టైం స్పెండ్ చేయడం.. వెకేషన్లకు వెళ్లడం మాత్రం మానరు. పనిలో తీరిక లేకుండా ఉన్నా.. కుటుంబానికి మాత్రం సరైన సమయం కేటాయిస్తూ ఉంటారు. వర్క్-ఫ్యామిలీ లైఫ్‌ను కరెక్ట్‌గా బాలెన్స్ చేస్తుంటారు. అందుకే ఈ కపుల్ అంటే టాలీవుడ్లో ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ చాలా ఇష్టం.
మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్-నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత ఆ తర్వాత ఇల్లు, పిల్లలు, ఇతర పనుల్లో బిజీ అయిపోయింది. చాలా తక్కువగా లైమ్ లైట్లోకి వస్తుంది నమ్రత. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది. చాలా రోజుల తర్వతా నమ్రత లైమ్ లైట్లోకి వచ్చింది. వివాహం అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం వర్క్ లైఫ్‌ని, ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న నమ్రత శిరోద్కర్ తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తొలిసారి తన వ్యక్తిగత విషయాలపై నోరు విప్పింది.
‘సినిమాల్లోకి రాకముందు నేను మోడలింగ్ చేశాను. మోడలింగ్ బోర్ కొట్టడంతో సినిమా పరిశ్రమ వైపు వచ్చా. నటిగా ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశా. ఆ సమయంలోనే మహేశ్‌ను కలిశా. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. మహేశ్‌బాబు నేనూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా లైఫ్‌లోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది.
మాతృత్వం పొందడం ఓ గొప్ప అనుభూతి. భార్యాభర్తలుగా మా మధ్య గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే ఉంటుంది. పిల్లలు ఏమడిగా నేను నో చెబుతుంటా. ఆయన మాత్రం వాళ్లను బాగా గారాబం చేస్తారు. ఏది అడిగినా కాదనరు. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్‌నే అడుగుతుంటారు. ఈ విషయంలో మాత్రం మా మధ్య సరదాగా వాదనలు జరుగుతుంటాయి. సితార అన్‌ప్లాన్‌డ్ బేబీ. తను వచ్చాకా జీవితమే మారిపోయింది. తనపట్ల మహేశ్ చాలా సంతోషంగా ఉన్నారు’ అని నమ్రత శిరోద్కర్ చెప్పింది.
ఇక మహేశ్ నటించిన సినిమాల్లో తనకు పోకిరి అంటే చాలా ఇష్టమని.. ఆ మూవీలో బుల్లెట్ దిగిందా లేదా అనే పంచ్ డైలాగ్ తనకు ఎంతగానో నచ్చిందని నమ్రత చెప్పుకొచ్చింది. గౌతమ్ పుట్టిన సమయంలో కఠిన పరిస్థితులు చూశామని, 8 నెలల్లోనే గౌతమ్ పుట్టడంతో బతుకుతాడో లేదో అని వైద్యులు చెప్పారంటూ నమ్రత ఎమోషనల్ అయింది.