Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 హోస్ట్ గా క్రేజీ హీరో..రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?



Bigg Boss 7 Telugu : ఈ మధ్య టెలివిజన్ లో రియాలిటీ షోలు ఎక్కువ అవుతున్నాయి.. అందులో కొన్ని షోలు మంచి టాక్ తో పాటు డిమాండ్ ను కూడా అందుకున్నాయి.. మరికొన్ని విమర్శలు అందుకొని కొద్ది రోజుల్లోనే వెనుతిరుగుతున్నాయి.. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న తెలుగు రియాలిటీ టీవీ షోలలో ఒకటి బిగ్ బాస్. బిగ్ బాస్ సీజన్ 6 నేటి తో ముగియనుంది..

Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu

వరుసగా నాలుగో సీజన్‌కు నాగార్జున నాగ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. బిగ్ బాస్ సీజన్ 6కి నాగార్జున మళ్లీ హోస్ట్ గా వ్యవహరించారు..ప్రతి ఎపిసోడ్‌కు 55 లక్షలు వసూలు చేశాడు.మునుపటి సీజన్‌లో, అతను ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు 40 లక్షలు వసూలు చేశాడు, అయితే ఈ సీజన్‌లో, అతను షో హోస్ట్ కోసం తన ఛార్జీలను పెంచాడు. ఈ సీజన్‌లో మొత్తం 30 ఎపిసోడ్‌లు ఉన్నాయి అంటే టోటల్‌గా 16.5 కోట్లతో నాగార్జున దూసుకుపోతున్నాడు..సీజన్ 6 లో భాగంగా ఆడియన్స్ ఓటింగ్ తో పని లేకుండా బిగ్ బాస్ నిర్వహకులే టైటిల్ విజేతను ప్రకటించడం నాగార్జునకు నచ్చలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

అందుకే ఆయన ఈ షో కి హోస్టింగ్ చేయనని చెప్పేశారట. దీంతో ఒక కొత్త హీరో.. యంగ్ హీరో.. అందరికీ సుపరిచితుడై ఉన్న వారిని హోస్టుగా తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఈ సీజన్ సెవెన్ కి హోస్టుగా తీసుకురాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత ఖుషి సినిమాలో నటిస్తున్నారు. కానీ సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.

vijay devarakonda
vijay devarakonda

ఇప్పుడు స్టార్ హీరోలు ఎవరూ ఖాళీ లేకపోవడంతో ఇతన్ని కంఫార్మ్ చేసే ఆలోచనలో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఇది రూమర్ మాత్రమేనా అనేది ప్రస్తుతం సందేహంగా మారింది. నిజంగా విజయ్ దేవరకొండ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ షో టి ఆర్ పి రేటింగ్ మారిపోతుంది అని. అన్ని సీజన్లను మించి మొదటి స్థానానికి చేరుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. మరికొంతమంది నాగ్ లాగా చెయ్యలేడు అంటున్నారు.. నాగ్ రెమ్యునరేషన్ లో సగం విజయ్ కు ఇస్తారని అంటున్నారు..మరి ఈ వార్తల్లో నిజం ఎంతఉందో తెలియాలంటే ఈ షో అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..