Married celebrities in 2022 : 2022లో వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సెలబ్రిటీలు ఎవరో తెలుసా..?

- Advertisement -

Married celebrities in 2022 : 2022 ఏడాది చాలా మంది సెలబ్రిటీల జీవితాలను మలుపు తిప్పింది. కొందరికి బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తే.. మరి కొందరికి తమ భాగస్వాములను పరిచయం చేసింది. ఇంకొందరికి తాము ప్రేమిస్తున్న భాగస్వాములతో జీవితాంతం ముడి వేసింది. అలా 2022లో చాలా మంది సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ లైఫ్ కి చెక్ పెట్టారు. తాము ప్రేమించిన వ్యక్తులతో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.  ఈ ఏడాదిలో ఆ మధురక్షణాలను ఆస్వాదించిన సెలబ్రిటీలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి..! 

Alia Bhatt and Ranbir Kapoor

ఈ ఏడాది బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ఏప్రిల్ 14, 2022 న వివాహం చేసుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా సెట్‌లో వీరు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఈ ఏడాదే ఓ ఆడ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కూతురు పేరు రాహా అని పెట్టారు.

Mouni Roy and Suraj Nambiyar

బాలీవుడ్ నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 27న గోవాలో వివాహం చేసుకుంది. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన మౌని రాయ్ ఆ తర్వాత బాలీవుడ్‌లో సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇటీవలే ఈ బ్యూటీ నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో మౌనీ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది.

- Advertisement -
Richa Chadda and Ali Fazal

మరో బాలీవుడ్ జంట రీచా చడ్డా, అలీ ఫజల్ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. సెప్టెంబర్ 30న పెళ్లి చేసుకున్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల వీరి పెళ్లి చాలాసార్లు వాయిదా పడింది.

Nayanatara and Vignesh Shivan

లేడీ సూపర్ నయనతార, తమిళ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నారు. ఈ ఏడాది జూన్ 10న ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. పెళ్లైన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా కవల పిలలకు తల్లిదండ్రులయ్యారు.

ప్రముఖ హీరోయిన్ హన్సిక డిసెంబర్ 4న ముంబయి వ్యాపార వేత్త సోహైల్‌ను పెళ్లి చేసుకుంది. సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.

Naga Shaurya and Anusha

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఈ ఏడాది ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని నవంబర్ 20న పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు.

Shamna Kasim and Shanid Asif

టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ అలియాస్ షమ్నా కాసిం తన చిరకాల ప్రియుడితో వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. పూర్ణగా ప్రసిద్ధి చెందిన ఈ నటి అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంది. ఈమె భర్త దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త.

Manjima Mohan and Gautham Karthik

కోలీవుడ్‌ యువ జంట గౌతమ్‌ కార్తీక్‌, మంజిమా మోహన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో నవంబర్ 28న పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని యువ జంటను అభినందించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here