Shah rukh Khan : షారుఖ్ నువ్వు రిటైర్ అయిపో.. నెటిజన్ సలహాకు కింగ్ మైండ్ బ్లాక్ రిప్లై..బాలీవుడ్ బాద్ షా.. కింగ్.. Shah rukh Khan . ఈ కింగ్ ఏం చేసినా స్పెషలే. షారుఖ్ మాట్లాడుతుంటే ఎన్ని గంటలైనా వినాలనిపిస్తుంది. తను మాటల్లో నిజాయితీ.. హ్యూమర్.. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. గత కొంతకాలంగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న షారుఖ్.. బ్లాక్‌బస్టర్ హిట్‌తో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి పఠాన్. ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాలేదు కానీ.. అప్పుడే ఈ చిత్రాన్ని వివాదాలు తెగ చుట్టుముట్టుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది.

Shah rukh Khan
Shah rukh Khan

పఠాన్‌లో దీపిక-షారుఖ్‌ల మధ్య ఓ ఇంటిమేట్ సాంగ్ షూట్ చేశారు. బేషరమ్ రంగ్ అంటూ సాగిన ఈ పాటలో దీపిక బికినీలో సందడి చేసింది. ఈ పాటలో కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని ఇప్పటికే వివాదం నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ పాటపై ట్రోలింగ్ మామూలుగా లేదు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాను ప్రదర్శించనీయమని స్వయంగా మంత్రులు.. ఎంపీలే నిరసనకు దిగారు. అయినా షారుఖ్ ఏమాత్రం తగ్గడం లేదు. తరచూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాడు.

‘పఠాన్‌’పై విమర్శలు చేసిన ఓ నెటిజన్‌కు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. విమర్శలు తగదని, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని అన్నారు. తాను ట్విటర్‌లోకి అడుగుపెట్టి 13 ఏళ్లు అయిన సందర్భంగా షారుక్‌ తాజాగా నెటిజన్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌.. షారుక్‌పై తన వ్యతిరేకతను బయటపెట్టాడు. ‘మీరు నటించిన ‘పఠాన్‌’ (Pathaan) ఒక డిజాస్టర్‌. కాబట్టి ఇక రిటైర్మెంట్‌ తీసుకోండి’ అని ట్వీట్‌ చేశాడు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన షారుక్‌.. ‘పెద్దవాళ్లతో గౌరవంగా మాట్లాడాలి’ అంటూ కౌంటర్‌ విసిరారు.

అనంతరం మరో నెటిజన్‌.. ‘సర్‌.. మీరు కశ్మీర్‌కు చెందిన వాళ్లు కదా. మరి మీ పేరు వెనుక ఖాన్‌ అని ఎందుకు పెట్టుకున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘‘చూడండి.. ఈ ప్రపంచం మొత్తం నా కుటుంబమే. కుటుంబాన్ని బట్టి మనకు పేరు రాదు. మనం చేసే పనుల బట్టే మనకు పేరు, గౌరవం వస్తుంది. ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడకండి’’ అని షారుక్‌ రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్‌.. ‘‘పఠాన్‌’లో సల్మాన్‌ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది?’’ అని అడగ్గా.. ‘‘మీకు భాయ్‌ని చూడాలనిపించినప్పుడల్లా టికెట్‌పై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయండి. సినిమాలో మీకు భాయ్‌ కనిపిస్తారు’’ అని సమాధానం ఇచ్చారు. ఆయా ట్వీట్స్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

2018లో విడుదలైన ‘జీరో’ తర్వాత షారుక్‌ ఖాన్‌ సినిమాలకు దూరంగా ఉన్నారు. సుమారు ఐదేళ్ల తర్వాత ‘పఠాన్‌’తో ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. జనవరి 25న ఈ సినిమా విడుదల కానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో షారుక్‌కు జోడీగా దీపిక నటించింది. జాన్‌ అబ్రహం ప్రతినాయకుడు. సల్మాన్‌ఖాన్‌ ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించారు. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకుడు.

Tags: