Bigg Boss 7 Telugu : ఈసారి హౌస్ కు వెళ్ళేది ఎవరో తెలుసా?Bigg Boss 7 Telugu : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..టెలివిజన్ చరిత్రను ఈ షో తిరగరాసింది..టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తీ చేసుకుంది. ఆరో సీజన్ ను తాజాగా పూర్తీ చేసుకుంది..గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ లో విన్నర్ ఎమౌంట్ ను కూడా పెంచారు..అంతే కాదు ఇందులో 21 మంది ఇంటి సభ్యులను తీసుకొని వచ్చారు. వందల రోజులు వుంచి.. రకరకాల టాస్క్ లు పెట్టి అందులో నుంచి వారం వారం ఏమినేషన్స్ పెడుతూ ఎంతో రసవత్తరంగా సాగుతుంది ఈ గేమ్ షో.

Bigg Boss 7 Telugu
Bigg Boss 7 Telugu

కాగా, తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ గేమ్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. కాగా మనదగ్గర సీజన్ వన్ కు తారక్ హోస్ట్ చేసి గ్రాండ్ సక్సెస్ చేయగా.. ఆతర్వాత సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. నాని తర్వాత ఆ బాధ్యతలను కింగ్ నాగార్జున తీసుకున్నారు..సీజన్ 3 నుంచి 6 వరకు అక్కినేని నాగార్జున హోస్ట్గా చేశారు..ఆరో సీజన్ మాత్రం పెద్దగా జనాలను ఆకట్టుకోలేకపోయింది..ఇక ఎడో సీజన్ 7 మొదలు కానుంది. అయితే ఈసీజన్ కు హోస్ట్ మారనున్నారని కొంతకాలంగా వస్తున్నాయి..

మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. సీజన్ 7లోకి వెళ్ళేది వీరే అని కొంతమంది పేర్లు ఇప్పటి నుంచే వైరల్ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో టిక్ టాక్ ద్వారా ఫెమస్ అయిన దుర్గారావు పేరు వినిపిస్తోంది. అలాగే అదే టిక్ టాక్ పుణ్యమా అని యాంకర్ గా మరి ఇప్పుడు హీరోయిన్ గాను చేసిన దీపికా పిల్లి, నయన పావని, వైష్ణవి చైతన్య , జబర్ధస్ వర్ష, పవిత్రల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి..నిజంగానే వీరు వెల్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది… బిగ్ బాస్ ఆలోచనలు ఎప్పుడూ ఎలా ఉంటాయో ఊహించడం కష్టమే..