Pooja Hegde : బాలీవుడ్​ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ హూజా హెగ్డే.. కన్​ఫర్మ్ చేసిన ఫిలిం క్రిటిక్



టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. అయితే ఈ ఏడాది ఈ బ్యూటీకి కాస్త అచ్చిరాలేదనే చెప్పాలి. ఈ సంవత్సరం పూజా Pooja Hegde నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయినా ఈ అమ్మడుకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. హిట్స్ లేకపోయినా.. వరుస ఫ్లాప్​లతో ఉన్నా.. ఈ బుట్టబొమ్మకు ఆఫర్ల వర్షం కురుస్తూనే ఉంది. కేవలం టాలీవుడ్​లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్​లలోనూ వరుస అవకాశాలొస్తున్నాయి ఈ భామకు.

Pooja Hegde and Salman khan
Pooja Hegde and Salman khan

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకున్న పూజ మనసు ఇప్పుడు బాలీవుడ్​పై పడింది. ముంబయి ప్రేక్షకులను అలరించడానికి ఈ బ్యూటీ తెగ ఆరాటపడుతోంది. ఈ అమ్మడు ఆరాటం చూసిన బీ టౌన్ ఫిల్మ్ మేకర్స్​ ఆమెకు వరుస అవకాశాలిస్తున్నారు. క్రేజీ ఆఫర్స్​తో అక్కడ కూడా తన సత్తా చాటుతోంది. కానీ ఎన్ని సినిమాలు చేసినా బీ టౌన్​లో నెక్స్ట్ లెవెల్​కు చేరుకోలేకబోతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్​ కామియో రోల్​లో నటిస్తున్నారు.

ఇప్పటి వరకు పూజా హెగ్డే పర్సనల్ లైఫ్.. అదేనండి తన రిలేషన్​షిప్ గురించి ఎలాంటి పుకార్లు రాలేదు. ఈ బ్యూటీ తన ఫోకస్ అంతా కెరీర్​పైనే ఉందని చెప్పుకుంటూ వచ్చింది కూడా. కానీ రీసెంట్​గా బాలీవుడ్​లో పూజాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. బాలీవుడ్​ స్టార్ హీరోతో పూజా రిలేషన్​షిప్​లో ఉందనే వార్త నెట్టింట వైరల్​గా మారింది.

Pooja and Salman Khan

వివాదాస్పద ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు మూవీ రివ్యూలు ఇస్తూ కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఫేమస్ అయ్యాడు. తాజాగా ఉమైర్ సంధు పూజా హెగ్డే గురించి గురించి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పూజా హెగ్డే, కండల వీరుడు సల్మాన్ ఖాన్ మధ్య ప్రస్తుతం లవ్ అఫైర్ కొనసాగుతున్నట్లు ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. “బీ టౌన్​లో కొత్త ప్రేమ మొదలైంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో ‘కిసీకా భాయ్ కిసీ కి జాన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్​లో మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేసింది.” అంటూ ఉమైర్ సంధు ట్వీట్ చేశారు.

PoojaHegdeand salmankhan

ఉమైర్ కామెంట్స్ పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు చేసే కామెంట్స్ అన్ని ఫేక్ అని కొట్టి పారేస్తుంటే.. మరికొందరు మాత్రం అందులో నిజం లేకపోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్​లో రాణించేందుకు పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ అండదండలు కోరుకుంటోందని.. అందుకే అతడితో క్లోజ్ గా ఉంటోంది అని అంటున్నారు.

ఇటీవల పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా సల్మాన్ ఖాన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సెట్స్ లోనే పూజా హెగ్డే బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్​కు ప్రేమ వ్యవహారాలు కొత్తేమీ కాదు. కానీ పూజా హెగ్డే ఈ సీనియర్ హీరోతో నిజంగా రిలేషన్​లో ఉందా అనేది ప్రశ్న.

Tags: