Veera Simha Reddy Trailer : ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న ‘ వీర సింహారెడ్డి ‘ ట్రైలర్..Veera Simha Reddy Trailer : అఖండ మూవీ తో భారీ హిట్ ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. తాజాగా వీర సింహా రెడ్డి అనే మూవీలో హీరో గా నటించాడు. శృతిహాసన్ ఈ మూవీలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా ,గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.. మైత్రి సంస్థ నిర్మించిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు..

veera simha reddy trailer
veera simha reddy trailer

తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించారు. అనుకున్న దానికన్నా బాలయ్య ఫ్యాన్స్ అక్కడికి చేయకున్నారు.. జై బాలయ్య అంటూ హోరెత్తిస్తున్నారు..

తాజాగా వీరసింహారెడ్డి ట్రైలర్ ను విడుదల చేశారు.. బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా వీర సింహారెడ్డి ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ లో బాలయ్య మరోసారి తన మార్కులు చూపించారు.. మాస్ డైలాగ్కులతో హోరెత్తించారు.. ఈ ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే విశేషమైన వ్యూస్ ను సొంతం చేసుకుంది.. బాలకృష్ణ ఫాన్స్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.. బాలయ్య వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఊచ కోత కలెక్షన్స్ వసూలు చేస్తుదనడంలో సందేహం లేదు..మరి ఎలా వుంటుందో చూడాలి.