అన్నీ చూపిస్తూ.. ఆఫర్లు అందుకుంటున్న నయనతార.. ప్రస్తుతం ఎన్ని చేస్తుందంటే..కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార జోరు మాములుగా లేదు. ఇటీవలనే డైరెక్టర్ విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్న నయనతార ఒక పక్క వైవాహిక జీవితం చక్కగా మ్యానేజ్ చేస్తూనే మరోపక్క వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఆమె బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజై , ప్రస్తుతం విజయపథంలో దూసుకుపోతుండగానే మరో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లింది నయనతార. నయనతార ప్రధాన పాత్రలో డ్యూడ్ విక్కీ అనే దర్శకుడిని పరిచయం చేస్తు ఒక సినిమా రూపొందుతుంది.

కోర్ట్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా పేరును రివీల్ చేస్తూ నిన్న సాయంత్రం మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. మన్నంగట్టి సిన్స్ 1960 అనే పేరుతో ఈ సినిమా రాబోతుంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై లక్ష్మణ్‌ కుమార్‌ అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాతో పాటు, నయనతార ఇరైవన్, మోహన్ రాజా, జయం రవి కాంబినేషన్ లో రాబోతున్న తని ఒరువన్ 2, అలాగే లేడీ సూపర్ స్టార్ 75, సినిమాలతో బిజీగా ఉంది.

నయనతార తో జట్టుగా పెళ్లి అయిన కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలు చేయడానికే నానా కష్టాలు పడుతుండగా నయనతార మాత్రం సినిమాల మీద సినిమాలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక జవాన్ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుండటంతో నయనతారకు బి టౌన్ నుంచి కూడా చాలా సినిమాలు వస్తున్నాయని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.