మహేశ్ కోసం కత్తిలాంటి ఫిగర్ ను సెట్ చేసిన త్రివిక్రమ్.. ముచ్చటగా మూడోసారి..మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న గుంటూరు కారం సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే గుంటూరు కారం సినిమాలో ముచ్చటగా ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా రెండవ హీరోయిన్ గా హిట్ సినిమా మీనాక్షి చౌదరి కనిపించనుంది.

ఇక ఈ ఇద్దరు హీరోయిన్స్ తో పాటు మరో స్టార్ హీరోయిన్ కూడా గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు పక్కన మెరవనుందని సమాచారం అందుతోంది. అయితే మరి గుంటూరు కారం సినిమాలో మహేష్ తో నటించబోతున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు కాజల్ అగర్వాల్. గతంలో బిజినెస్ మ్యాన్, బ్రహ్మోత్సవం సినిమాలలో మహేష్ బాబుతో నటించిన కాజల్ గుంటూరు కారం సినిమాతో ముచ్చటగా మూడో సారి మహేష్ తో జత కట్టనుంది.కానీ గుంటూరు కారం సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర నిడివి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని సమాచారం. త్రివిక్రమ్ గత చిత్రాలలో పలు హీరోయిన్స్ కు ఉన్న క్యారెక్టర్ల లాగానే కాజల్ పాత్ర కూడా ఉండబోతుందని టాక్.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలలో ముగ్గురు, నలుగురు హీరోయిన్స్ ఉండటం ఇదేమి కొత్తకాదు. సన్ అఫ్ సత్యమూర్తి, అరవింద సమెత, అలా వైకుంఠపురం లో వంటి సినిమాలలో ఆదా శర్మ, నివేత పేతురాజ్, నిత్య మీనన్, ఈషా రెబ్బవంటి హీరోయిన్స్ ను తీసుకొని వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను చేసిన త్రివిక్రమ్ లేటెస్ట్ గా గుంటూరు కారంలో కాజల్ అగర్వాల్ తో క్యారెక్టర్ చేయించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కాజల్ మహేష్ జోడి స్క్రీన్ పైన మరోసారి కనిపించడం అభిమానులకు సంతోషం కలిగించే విషయం అనే చెప్పాలి.