Naga Chaitanya : బాలకృష్ణకు నాగచైతన్య కౌంటర్.. అలా మాట్లాడి పరువు తీసుకోకండంటూ..?



Naga Chaitanya : నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో పేజీలకు పేజీలున్న డైలాగులు అలవోకగా చెప్పేస్తారు. కానీ ఓ స్టేజీ మీద మాత్రం ఆయన మాటలు ఒక దగ్గర మొదలై ఇంకో టాపిక్‌లోకి జంప్ అవుతుంటాయి. ఇక ఆయన ప్రసంగంలో తలా తోక ఉండవు. సరైన స్క్రీన్‌ప్లే లేక అప్పుడప్పుడు ఆయన మాటలు హద్దులు దాటుతుంటాయి. అలా రీసెంట్‌గా కూడా బాలయ్య నోరుజారారు. ఈసారి ఏకంగా అక్కినేని నాగేశ్వరరావునే టార్గెట్ చేశారు.

Naga Chaitanya
Naga Chaitanya

ఆదివారం రోజున హైదరాబాద్‌లో వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ పెట్టారు. ఈ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ ప్రసంగా జోరుగా సాగింది. అంతా జాలీగా సాగుతుందనుకున్న సమయంలో బాలయ్య మళ్లీ నోరు జారారు. సక్సెస్ మీట్‌లో ఏదో మాట్లాడుతూ, పక్కన ఎవరి గురించో చెబుతూ, ‘ఈయన ఉన్నాడంటే సెట్‌లో ఏదో ఒకటి… ఆ రంగారావు..ఈ రంగారావు .. అక్కినేని.. తొక్కినేని..’ అంటూ మాట బాలయ్య నోరుజారారు.

ఈ మాటలపై అక్కినేని కుటుంబం స్పందించింది. అక్కినేని నాగచైతన్య బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడిన మాటలపై చైతన్య స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. నందమూరి తారకరామా రావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం. అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు.

balakrishna

అసలేం జరిగిందంటే.. వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. “మా మధ్య రకరకాల విషయాలు చర్చకు వస్తాయి. నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంతా కూడా..” అంటూ బాలయ్య సడెన్‌గా ఏదో మాట్లాడేశారు. పాత సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నామని చెప్పే క్రమంలో అక్కినేని పేరెత్తిన బాలయ్య దాంతో పాటు ‘తొక్కినేని’ అనే మాట వాడటంతో ఈ వీడియో వైరల్ అయిపోయింది.

‘అక్కినేని’ ఫ్యామిలీని ఇంత మాట అనేసరికి ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు. ఇది ‘అక్కినేని’ని డీగ్రేడ్ చేయడంలో భాగమే అంటూ బాలయ్యను అక్కినేని అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అందులోనూ బాలయ్య ఈ కామెంట్స్ చేసిన అదే రోజూ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కావడంతో ఇది మరింత రచ్చ అయింది. బాలయ్య కావాలని ఉద్దేశపూర్వకంగానే ఏఎన్‌ఆర్‌పై ఈ కామెంట్స్ చేశారని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇదే సభలో బాలయ్య మరో మాట కూడా అన్నారు. నీతి..నిజాయతీతో గర్జించాలి అంటే తనలా సింహంలా పుట్టాలని… దాని మీద కూడా టాలీవుడ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి.