Manchu Lakshmi : తెగించిన మంచు లక్ష్మీ.. అమ్మాయితో లిప్​లాక్.. నెటిజన్లు షాక్​

- Advertisement -

మంచు లక్ష్మీ.. నటి, యాంకర్, నిర్మాత, యూట్యూబర్, సింగర్​. మోహన్​బాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన Manchu Lakshmi.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలు.. వెబ్ సిరీస్​లు.. షోస్ చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఓవైపు తెలుగు సినిమాలు చేస్తూనే.. మరోవైపు తమిళ, మలయాళ మూవీస్​లోనూ నటిస్తోంది. యాక్టింగ్, హోస్టింగ్, సింగింగ్.. ఇలా లక్ష్మీ చేయలేని పనంటూ ఏం ఉండదేమో అనిపించేలా అన్ని క్రాఫ్ట్స్​లో తన సత్తా ఏంటో చూపిస్తోంది.

Manchu Lakshmi
Manchu Lakshmi

తాజాగా మంచు లక్ష్మీ మలయాళంలో నటించిన మాన్​స్టర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ మోహన్​లాల్ సరసన లక్ష్మీ నటించింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ.. మంజు దుర్గ అనే పాత్రలో నటించింది. ఈ పాత్రకు విమర్శల ప్రశంసలు దక్కాయి.

ఈ మూవీలో మంచు లక్ష్మీ చేసిన పాత్ర ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ చేసిన రోల్ చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఇందులో ఆమె లెస్బియన్‌గా నటించింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మీ చేసిన పాత్రకు ఓవైపు ప్రశంసలు మరోవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే మామూలుగా ట్రోలింగ్ జరగడం లేదు.

- Advertisement -

ఈ సినిమాలో మంచు లక్ష్మీతో పాటు.. మరో హీరోయిన్‌కు మధ్య బోల్డ్ సన్నివేశాలు కూడా రూపొందించారు. ఈ ఇద్దరివి లిప్​లాక్ సీన్లు కూడా ఉన్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు షాక్ అవున్నారు. మంచు లక్ష్మీ ఏంటి ఇలాంటి సీన్లు చేసిందని ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ఈ సినిమా పై స్పందించిన మంచు లక్ష్మీ ప్రసన్న. తన క్యారెక్టర్ పేరు మంజు దుర్గ అని చాలా మంచి పాత్ర దక్కిందన్నారు. తన పాత్ర స్క్రిప్ట్​లో చెప్పినట్లే ఉందని.. ఎలాంటి మార్పులు, ఎడిటింగ్​లు లేకుండా అలాగే ఉంచారని చెప్పారు.

ఈ సినిమాలో డల్‌గా సాగిపోయే ‘మంజు దుర్గ’ పాత్రని పోషించేందుకు ఎనర్జిటిక్‌గా షూటింగ్‌కి వెళ్లేదాన్ని అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. దాంతో సెట్‌లోని వారు మీరు డల్‌గా ఉండటం ప్రాక్టీస్ చేయాలని చెప్పేవారట. దాంతో ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకుని.. మలయాళంని అర్థం చేసుకునేందుకు కాస్త టైమ్ పట్టిందని మంచు లక్ష్మి గుర్తు చేసుకుంది. ఆమె ప్రస్తుతం గాంబ్లర్‌, అగ్ని నక్షత్రం, మహిళా లోకం సినిమాల్లో చేస్తోంది.

మంచు లక్ష్మిపై గత కొంతకాలంగా విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. మంచు లక్ష్మి ఏం మాట్లాడినా.. దానిపై నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ తయారు చేస్తుంటారు. కానీ ఇటీవల ఆ ట్రోల్స్ తగ్గిపోయినట్లు మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. చివర్లో మరో ఆసక్తికరమైన విషయం కూడా మంచు లక్ష్మి వెల్లడించింది. ట్రోలర్స్‌కి రెగ్యులర్‌గా తనే హింట్స్ ఇస్తుందట.. ఆ హింట్స్ ఆధారంగా వచ్చే ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసినట్లు వెల్లడించింది. ఈ ట్రోల్స్‌పై ఇటీవల మంచు విష్ణు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని ఓ వ్యక్తి ఆఫీస్ పెట్టుకుని మరీ తన ఫ్యామిలీపై ట్రోల్స్‌ చేయిస్తున్నట్లు మంచు విష్ణ చెప్పుకొచ్చాడు. అతనిపై చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా చెప్పాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here