Namrata Shirodkar : నమ్రతకు ఊహించని కామెంట్స్.. మహేష్ ఫ్యాన్స్ ఫిదా..

- Advertisement -

Namrata Shirodkar : చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సినిమాలు హిట్ అయ్యే కొద్ది ఫ్యాన్స్ కూడా పెరుగుతారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా చేసిన ముద్దుగుమ్మలు ప్రజెంట్ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయి.. వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.. ఏజ్ 50 దాటిన సరే కత్తిలాంటి ఫిగర్ ని మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నారు

అలాంటి హీరోయిన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత కూడా ఒకరు..ఆమె పెళ్ళి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి ఇంటిని, పిల్లలను,మహేష్ బాబు సినిమా వ్యవహారాలను చూసుకుంటున్నారు.. ఆమె మేకప్ వేసుకొని, మోడరన్ డ్రెస్సులో ఎప్పుడూ కనిపించలేదు.. పద్దతిగా కనిపిస్తుంది.దీనిపై గతంలో ఎన్నో కామెంట్లు వచ్చాయి. అయిన కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మరో కామెంట్ జనాలను ఆలోచనలో పడేస్తుంది..

- Advertisement -
Namrata Shirodkar
Namrata Shirodkar

బాలివుడ్ లో నమ్రత శిరోద్కర్ స్టార్ హీరోయిన్. ఆమె సినిమాలు చేసే టైంలో సినీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో అల్లాడించింది . అప్పట్లో ఆమె అందాలకు జనాలు మంత్రముగ్ధులయ్యే వాళ్ళు . అంతేకాదు ఎలాంటి హాట్ బట్టలు వేసిన తన లిమిట్స్ ని ఏనాడు క్రాస్ అయ్యే వారే కాదు. ఆ పద్ధతుల నచ్చే మహేష్ బాబు నమ్రతకు పడిపోయారు. కాగా వీరిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మహేష్ నమ్రత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది .

సినిమా ఇండస్ట్రీకి దూరమైన సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటున్న నమ్రత.. రీసెంట్గా షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . హీరోయిన్స్ అందరూ ఒంటి మీద బట్ట నిలవనంత దారుణంగా ఫోటోషూట్స్ చేస్తుంటే ..నమ్రత చాలా ట్రెడిషనల్ గా పద్ధతిగా చుడీదార్ తో సింపుల్ లుక్ లో అభిమానులను ఆకట్టుకుంది .

అంతేకాదు ఈ ఫొటోస్ చూసిన మహేష్ బాబు అభిమానులు “మీరు అన్నం తింటున్నారా లేక అమృతం తాగుతున్నారా మేడమ్” అంటూ కామెంట్ చేయడం హైలైట్ గా మారింది. ఈ క్రమంలోనే ఒళ్ళు ఎక్స్పోజ్ చేసే హీరోయిన్స్ కి నమ్రత ఫొటోస్ కి ట్యాగ్ చేస్తూ హీరోయిన్ అంటే ఇది ..అందం అంటే ఇలానే ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారట. దీంతో సోషల్ మీడియాలో నమ్రత పిక్స్ వైరల్ గా మారాయి..ఇవి వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ ఫిధా అవుతున్నారు.. ఆమె మహేష్ కు దొరకడం అదృష్టం అంటూ తబ్బిబ్బవుతున్నారు.

https://www.instagram.com/p/ClxmQ8xDZZE/?hl=en

మహేష్ బాబు సినిమాల విషయాన్నికొస్తే.. ఇటీవల సర్కారి వారి పాట సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు.ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమాకు వాయిదాలు పడుతూన్నాయి..మరి ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here