MM Keeravani : ఆస్కార్ వేదికపై కీరవాణి పాట.. చప్పట్ల తో దద్దరిల్లిన స్టేజ్..

- Advertisement -

MM Keeravani : ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్‌ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సినిమా విడుదల కన్నా ముందు నుంచే ఈ సాంగ్‌ దేశాన్ని ఓ ఊపు ఉపేసింది. ఇక ప్రస్తుతం ఆస్కార్‌ అవార్డుల బరిలో పోటీ పడుతోంది. అక్కడ కూడా నాటు నాటు పాట దుమ్ము రేపుతోంది. ఆస్కార్‌ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా వ్యాఖ్యత జిమ్మి మాట్లాడుతుండగానే కొందరు ఇంగ్లీష్‌ డ్యాన్సర్స్‌ వచ్చి నాటు నాటు స్టెప్పులేశారు. అలా నాటు నాటు పాటతోనే ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమం ప్రారంభం అవ్వడం విశేషం. ఇక ఆ తర్వాత లైవ్‌ పర్‌ఫామెన్స్‌లో భాగంగా.. సినిమాలో నాటు నాటు పాటని పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ ఆస్కార్స్‌ స్టేజీ మీద పాడుతుండగా.. డ్యానర్స్‌ స్టెప్పులతో అదరగొట్టారు.’

MM Keeravani
MM Keeravani

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో ఈ పాటకు చరణ్‌, జూనియర్లు మాస్‌ స్టెప్పులతో అదరగొడితే.. ఇక తాజాగా లైవ్‌ పర్‌ఫామెన్స్‌లో కూడా నాటు నాటు పాట ఓ ఊపు ఊపింది. ఆస్కార్స్‌ వేదిక మీద ఈ పాట ప్రదర్శనకు స్టేజీ ఊగిపోయింది. ఎంత భారీ రెస్పాన్స్‌ వచ్చిందంటే.. ప్రదర్శన పూర్తయ్యేసరికి.. అక్కడున్న ప్రతి ఒక్కరు లేచి.. చప్పట్ల మోతతో తమ ప్రశంసలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.. ఇకపోతే సంగీత దర్శకుడు, గేయ రచయిత చంద్రబోస్ ఈ అవార్డును అందుకున్న అనంతరం స్టేజ్ పై మాట్లాడిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి.. కీరవాణి పాట పాడుతూ రాజమౌళి ని పొగడ్తల తో ముంచేత్తేశారు.. అమెరికన్ స్లాంగ్ లో ఆయన పాడిన పాట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

మన తెలుగు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఇప్పటికే నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజగా ఆస్కార్ అవార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. 95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాటను ఆలపించారు. ఇక అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ అరుదైన ఘట్టం ఎట్టకేలకు వచ్చేసింది. కీరవాణి, చంద్రబోస్ అవార్డు అందుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై పలువురు సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here