Ram Charan ‘గేమ్ చేంజర్’ ఫస్ట్ లుక్ అదిరింది..1000 కోట్ల బాక్స్ ఆఫీస్ ఇక లాంఛనమే!

- Advertisement -

Ram Charan : అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రామ్ చరణ్ – శంకర్ మూవీ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఈరోజు వచ్చేసింది.ఈ సినిమాకి టైటిల్ గా సోషల్ మీడియా లో ఇన్ని రోజులు ప్రచారం అయ్యినవి కాదని, ఈరోజు ఉదయం వరకు ఫ్యాన్స్ తెలియలేదు.అందరూ ఈ సినిమాకి టైటిల్ ‘CEO’ అని అనుకున్నారు.కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ తో కూడిన వీడియో ని ప్రకటించి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది మూవీ టీం.

ప్రారంభం లో ఈ టైటిల్ జనాలకు రీచ్ అవ్వదేమో అనే భయం ఉండేది ఫ్యాన్స్ కి, కానీ అప్పుడే అలవాటు కూడా చేసేసుకున్నారు.ఇక కాసేపటి క్రితమే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి కూడా అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది.చాలా కాలం తర్వాత వింటేజ్ శంకర్ మార్కు కనిపించిందని అందరూ అంటూ ఉన్నారు.

ram charan
ram charan

సమాజానికి ఉపయోగపడే సినిమాలు తియ్యడం లో సిద్ద హస్తుడైన శంకర్, మరోసారి తన స్ట్రాంగ్ జోన్ లోకి వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా తియ్యగలడు అనేది ఈరోజు విడుద్దాల చేసిన టైటిల్ మరియు పోస్టర్ తోనే అర్థం అయిపోయింది. రెండిట్లోనూ ఆయన వింటేజ్ మార్కు కనపడింది. ముఖ్యంగా టైటిల్ కాన్సెప్ట్ వీడియో కి మామూలు రెస్పాన్స్ రాలేదు.సమాజం లో రాజకీయ నాయకులతో నడుమ పెరిగిన ఒక వ్యక్తి కింగ్ గా ఎదిగి ఒక్క అడుగు వెయ్యగానే అసెంబ్లీ మొత్తం దద్దరిల్లింది, అందుకే అతను గేమ్ చేంజర్ అనే విధంగా డిజైన్ చేసిన ఈ వీడియో ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యింది.

- Advertisement -
Ram Charan Game Changer First Look

శంకర్ తన సినిమా ప్లాట్ ని కేవలం 43 సెకండ్స్ లో చెప్పేసాడు. ఇంత సృజనాత్మక ఉంది కాబట్టే ఆయన రెండు దశాబ్దాల క్రితమే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు అంటున్నారు ఫ్యాన్స్. మరి టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఫ్యాన్స్ లో ఈ రేంజ్ జోష్ నింపిన శంకర్, సినిమాని కూడా అదే రేంజ్ లో తెరకెక్కించి ఉంటాడని రామ్ చరణ్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here