Ram Charan వదిలేసిన 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే.. చేసి ఉంటే ఇక ఏరేంజ్ లో ఉండేవాడో!

- Advertisement -

Ram Charan : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో అందరికంటే తక్కువ సినిమాలు చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రమే.చిరుత నుండి ఆచార్య వరకు ఆయన చేసిన సినిమాల సంఖ్య కేవలం 14..కానీ రికార్డ్స్ విషయం లో మాత్రం అందరికంటే ముందంజ లో ఉన్నాడు.మొదటి సినిమాతోనే కమర్షియల్ హీరో అనే పదానికి పర్యాయపదం లాగ నిల్చిన రామ్ చరణ్ కెరీర్ లో మగధీర, రంగస్థలం మరియు #RRR వంటి చిత్రాలు ఎంతో ప్రత్యేకం.అయితే కెరీర్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న రామ్ చరణ్ కూడా పలు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు అట.అవేంటో ఒకసారి చూద్దాము.

Ram Charan
Ram Charan

సూర్య s/o కృష్ణన్ :

Surya s/o krishna

తమిళ హీరో సూర్య నటించిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు మరియు తమిళం బాషలలో సూపర్ హిట్ అవ్వడమే కాదు,కల్ట్ క్లాసిక్ అనే స్టేటస్ ని కూడా దక్కించుకుంది.ఈ సినిమాలో సూర్య తండ్రి కొడుకులు లాగ ద్విపాత్రాభినయం చేసాడు,నటుడిగా ఆయనని మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఈ చిత్రం తొలుత రామ్ చరణ్ చెయ్యాల్సింది అట, కానీ పలు కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చింది.ఈ చిత్రం లోని పాటలు ఇప్పటికీ ఫేమస్.

- Advertisement -

ఓకే బంగారం :

ok bangaram

మలయాళం హీరో దుల్కర్ సాల్మన్ మరియు మణిరత్నం కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో తెలుగు , తమిళం మరియు మలయాళం బాషలలో పెద్ద హిట్ అయ్యింది.ఈ చిత్రాన్ని కూడా ముందుగా రామ్ చరణ్ చెయ్యాల్సింది అట.కానీ మాస్ ఇమేజి తో దూసుకుపోతున్న నన్ను మళ్ళీ లవ్ స్టోరీస్ లో ఫ్యాన్స్ చూడగలరా..అప్పటికే ఆరెంజ్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది, మళ్ళీ అలాంటి రిస్క్ చేసే సాహసం చెయ్యలేక ఈ చిత్రాన్ని వదులుకున్నాడట.

శ్రీమంతుడు :

srimanthudu

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం ఇది.వరుస డిజాస్టర్స్ తో కొట్టుమిట్టాడుతున్న మహేష్ ని మళ్ళీ సూపర్ ఫామ్ లోకి తీసుకొచ్చింది.ఈ చిత్రం కూడా రామ్ చరణ్ తో చెయ్యాల్సింది అట, అప్పట్లో ముహూర్తం కూడా జరుపుకొని మధ్యలోనే ఆగిపోయిన సినిమా మీకు గుర్తు ఉండే ఉంటుంది.ఆ చిత్రం ఇదేనట.

జెర్సీ :

jersey

హీరో నాని కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన ఫీల్ గుడ్ క్లాసిక్ చిత్రం ఇది.ఈ సినిమాని ముందుగా గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో చేద్దాం అనుకున్నాడట.కానీ అప్పటికే రాజమౌళి #RRR సినిమాకి కమిట్ అయిపోయి ఉన్నాడు.స్టోరీ అద్భుతంగా ఉంది, నేను కచ్చితంగా చేస్తాను కానీ ఇప్పుడు #RRR కమిట్మెంట్ ఉంది,మూడేళ్లు ఆగాల్సి వస్తాది.అప్పటి వరకు ఎదురు చూస్తాను అనే చూడు లేదా వేరే హీరో తో చేసేయ్ అన్నాడట.దీనితో గౌతమ్ ఆ తర్వాత నాని తో చేసి సూపర్ హిట్ కొట్టాడు.

100 % లవ్ :

సుకుమార్ మరియు నాగ చైతన్య కాంబినేషన్ లో గీత ఆర్ట్స్ తెరకెక్కించిన సినిమా ఇది. ఆ రోజుల్లో ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని అప్పట్లో తొలుత గీత ఆర్ట్స్ రామ్ చరణ్ తోనే చేద్దాం అనుకున్నారట.కానీ రామ్ చరణ్ లవ్ స్టోరీ కారణంగా ఈ సినిమాని కూడా రిజెక్ట్ చేసాడట.అలా రామ్ చరణ్ తన కెరీర్ లో ఈ 5 సూపర్ హిట్స్ ని వదులుకున్నాడని అంటుంటారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here