Waltair Veerayya : మెగాస్టార్ నోట జంబ‌ల‌కిడి జారుమిఠాయా..



Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. ఖైదీ నెంబ‌ర్ 150తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన చిరు త‌న స్థాయికి త‌గిన హిట్‌ని కొట్ట‌లేద‌న్న‌ది నిజం. ఇప్పుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన Waltair Veerayya తో మ‌ళ్ళీ త‌న స‌త్తా చాటాడు. ఈ చిత్రంలో చిరు లుక్‌, యాక్టింగ్‌, డాన్సుల్లో గ్రేస్ , కామెడీ టైమింగ్ పాత చిరుని గుర్తు చేశాయి. ఎక్క‌డా ఓవ‌ర్ కాకుండా పాత్ర ప‌రిధిలో ఇర‌గ‌దీశాడు.

Waltair Veerayya
Waltair Veerayya

ఈ సినిమాలో చిరు మార్కు కామెడీ బాగా పండింది. అయితే ఈ మ‌ద్య కాలంలో జంబ‌ల‌కిడి జారు మిఠాయా సాంగ్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సోష‌ల్ మీడియాలో రీల్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉందీ పాట‌. అయితే చిరంజీవి నోట ఆ పాట థియేట‌ర్లో న‌వ్వులు పూయించింది. నేను లుంగి క‌డ్తా చూడు నేను లుంగి క‌డ్తా చూడు అంటూ చిరు స్పూఫ్ చేశాడు. ఈ సీన్ కి థియేట‌ర్ న‌వ్వుల‌తో ద‌ద్ద‌రిల్లింది.

ఇక వాల్తేరు వీర‌య్య‌లో మాస్ ఆడియ‌న్స్‌కి కావాల్సినంత మ‌సాలా జోడించాడు ద‌ర్శ‌కుడు బాబీ. ఫ‌స్టాఫ్ మొత్తం చిరు కామెడీ, యాక్ష‌న్‌తో అల‌రించాడు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే ఫైట్ సినిమా నెక్స్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్ళ‌గా, పున‌కాలు లోడింగ్ అంటూ ఫ‌స్టాప్ ని ముగించారు. ఇక సెకండాఫ్ ర‌వితేజ ఎంట్రీతో ఊపందుకొని పూన‌కాలు ఊగిపోయారు చిరు, ర‌వితేజ‌. ర‌వి తేజ క్యారెక్ట‌ర్ సినిమాకు పెద్ద ప్ల‌స్‌, సీరియ‌స్ క్యారెక్ట‌ర్లో ఒదిగిపోయాడు. చిరు, ర‌వి తేజ‌ల మ‌ద్య వ‌చ్చే ఎమోష‌న్ సీన్ ప్రేక్ష‌కుల‌తో కంట‌త‌డిపెట్టించాయి. మొత్తంగా అన్నీ క‌ల‌గ‌సి చిరు ఖాతాలో మ‌రో హిట్ చేరింది.

కాక‌పోతే వీరిద్ద‌రి మ‌ధ్య వెంకీ స్టైల్లో ఏదైనా కామెడీ సీన్ పెట్టి ఉంటే అదిరిపోయేది అనేది ఫ్యాన్స్ మాట‌.