Walthair Veerayya : ఆ ఓటీటీకి ‘వాల్తేరు వీరయ్య’ డిజిటల్‌ రైట్స్.. స్ట్రీమింగ్‌ డేట్‌ కూడా వచ్చేసింది?

- Advertisement -

Walthair Veerayya : ఆచార్యతో ఫ్లాప్ సినిమా మూటగట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత గాడ్‌ఫాదర్‌తో కాస్త తేరుకున్నారు. కానీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు సరైన బ్లాక్‌బస్టర్ హిట్‌ మూవీ రాలేదు. అందుకే ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చిరంజీవి తనను అభిమానించే డైరెక్టర్ అయిన బాబీతో వాల్తేరు వీరయ్య చేశారు.

Waltair veerayya
Waltair veerayya

‘గ్యాంగ్‌లీడర్‌’, ‘ఘరానా మొగుడు’ సినిమాల ఛాయలు పోస్టర్‌లు, ట్రైలర్‌లలో కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. పైగా మాస్‌ మహరాజా రవితేజ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై పాజిటీవ్‌ రివ్యూలు తెచ్చుకుంది. ఈ సంక్రాంతికి భారీ ఓపెనింగ్స్‌ సాధించే సినిమా ఇదే అవుతుందని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

సీనియర్ హీరోలు దాదాపు వాళ్లను అభిమానించే డైరెక్టర్లతో సినిమా చేయడానికే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే.. వాళ్లకున్న స్ట్రాంగ్ ఫ్యాన్‌బేస్‌ను అట్రాక్ట్ చేయాలంటే ఓ ఫ్యాన్‌ వల్లే సాధ్యమవుతుందని నమ్మకం. హీరోల ఇమేజ్‌ని బట్టే ఈ ఫ్యాన్ డైరెక్టర్లు సినిమాను రూపొందిస్తూ ఉంటారు. కొత్త కథలు చెప్పడం కంటే తాము అభిమానించే హీరోను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారో.. ఎలాంటి సీన్స్ చూస్తే థియేటర్లో పూనకాలు పెడతారో.. అంచ‌నా వేసి మరీ కథలు అల్లుతుంటారు. అలాంటి యాంగిల్‌లోనే ‘వాల్తేరు వీర‌య్య‌’ మూవీ సాగుతుంది.

- Advertisement -
Mega Star Chiranjeevi
Mega Star Chiranjeevi

డైరెక్టర్ బాబీ ఒక ఫ్యాన్‌గా మెగాస్టార్ చిరంజీవి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో.. చిరుని తాను ఎలా చూడాలనుకుంటాడో అలాంటి కొలతలతోనే ఈ సినిమాను తెరకెక్కించాడు. ఊర మాస్ అవ‌తారంలో.. త‌న మార్క్ కామెడీ, యాక్ష‌న్ అంశాల‌తో చిరంజీవి సినిమా చేసి చాలా కాల‌మైంది. మ‌ళ్లీ ఆ ఇమేజ్‌ని తెర‌పై చూపించాల‌నే తప‌నే బాబీలో ఎక్కువ‌గా క‌నిపించింది.  మంచి ఎలివేష‌న్స్‌తో  చిరంజీవి ఒక‌ప్ప‌టి అవ‌తారాన్ని గుర్తు చేశాడు బాబీ. అందుకే థియేటర్‌లో మెగాఫ్యాన్స్ మామూలుగా రచ్చ చేయడంలేదు. డోంట్ స్టాప్ షౌటింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ తెగ హంగామా చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య రిలీజ్ అయి ఒక్క రోజు కూడా కాలేదు. అప్పుడే ఈ సినిమా ఓటీటీకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ కోవకు చెందిన ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఓ బిగ్‌ ఓటీటీ సంస్థ దక్కించుకుందట. ఆ ఓటీటీ సంస్థ ఏంటో తెలుసా మరి. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. తెలుగుతో పాటు హిందీ హక్కులను కూడా కొనుగోలు చేసిందట.

కాగా ఈ సినిమాను 6 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయాలని వీరయ్య బృందం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థతో డీల్‌ కుదిరించుకుందట. ఈ లెక్కన చేసుకుంటే మార్చిలో ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో చిరుకు జోడీగా శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here