Veera Simha Reddy : నందమూరి బాలయ్య అఖండ తర్వాత ‘వీరసింహా రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఫ్యాక్షన్ జోనర్ లో బాలయ్య ఊచకోత మొదలు పెట్టాడు, అన్ని సెంటర్స్ లో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు..ఓవర్సీస్ ప్రీమియర్స్ తోనే దాదాపు మిలియన్ మార్క్ ని టచ్ చేసిన వీర సింహా రెడ్డి సినిమా, ఓవరాల్ గా మొదటి రోజు 54 కోట్ల గ్రాస్ ని అందుకుంది.. అఫీషియల్ కలెక్షన్స్ రిపోర్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేశారు. బాలయ్య కెరీర్ లోనే డే 1 హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన సినిమాగా వీర సింహా రెడ్డి కొత్త చరిత్ర సృష్టించింది.
గతంలో బోయపాటి శ్రీను కూడా బాలయ్యకు మంచి హిట్ ను ఇచ్చాడు.. కానీ, ఈ రేంజ్ హిట్ ఇవ్వలేదు. ఒక ఫ్యాన్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు గోపీచంద్ మలినేని.. బాలయ్య గెటప్, డైలాగ్స్, తమన్ మ్యూజిక్, గోపీచంద్ మలినేని డైరెక్షన్ ఇలా ప్రతి విషయంలో వీర సింహా రెడ్డి ప్యూర్ ఫన్ స్టఫ్ ని ఇచ్చింది..ఇక తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏరియాల్లో వీర సింహా రెడ్డి సినిమా నాన్-రాజమౌళి రికార్డుని క్రియేట్ చేసింది. నైజాం బాలయ్యకి చాలా వీక్ జోన్.. కానీ వీర సింహా రెడ్డి సినిమా నైజాంలో రచ్చ లేపే కలెక్షన్స్ ని రాబడుతుంది. పాజిటివ్ టాక్ తో వీర సింహా రెడ్డి సినిమాని బాక్సాఫీస్ దగ్గర మరింత స్ట్రాంగ్ గా మార్చాయి.
బాలయ్య ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో హిట్ కొడతాడు అని ఊహించారు కానీ మరీ ఈ రెంజులొ హిట్ ను అందుకుంటాడని ఎవరూ ఊహించి వుండరు..ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోల రికార్డులు కూడా చెల్లా చెదురు అయ్యే రేంజులో హిట్ కొడతాడు అని ఎవరూ ఊహించి ఉండరు. ప్రస్తుతం ఉన్న ఇదే జోష్ కంటిన్యు అయితే మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం పక్క..మరి పూర్తీ రిజల్ట్ ఏంటో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.. ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.. బాలయ్యా..మజాకా..