Manchu Vishnu: అమితాబచ్చన్ ను తెలుగువారే పరిచయం చేశారు.. ఇది మరీ కామెడీగా లేదు..

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘నవతి ఉత్సవం’ జరగనుంది. గతంలో వజ్రోత్సవం జరిగినట్లే ఈసారి కూడా నవతీ ఉత్సవాలు నిర్వహిస్తామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మా అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు ఉపాధ్యక్షుడు మాదాల రవి, కోశాధికారి శివ బాలాజీ, ఈసీ సభ్యులు, పలువురు మలేషియా ప్రతినిధులు హాజరయ్యారు. మలేషియా నుంచి ఇక్కడికి వచ్చిన కమల్‌నాథ్‌కి, పర్యాటక శాఖకు ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా ఈవెంట్ చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులను స్మరించుకుంటూ ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా చేయాలనుకున్నాం.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది’’ అని మంచు విష్ణు తెలిపారు.‘‘అమితాబ్‌, అనిల్‌ కపూర్‌లు చాలా మంది నటీనటులను తెలుగు సినిమాలకు పరిచయం చేశారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం గొప్ప విషయం. ఎక్కడ చూసినా మన జై బాలయ్య అనే మాట వినిపిస్తోంది. మా అన్న అల్లు అర్జున్ మొదటి తెలుగు హీరో నేషనల్ అవార్డ్ తెచ్చాడు. అత్యధిక పారితోషికం తీసుకునే భారతీయ నటుడు ప్రభాస్. మహేశ్-రాజమౌళి సినిమా ఆసియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకోబోతోంది’’ అని మంచు విష్ణు అన్నారు. అయితే మంచు విష్ణ మాటలకు నెటిజన్స్ కామెంట్ మామూలుగా చేయట్లేదు. ఏంటి అమితాబచ్చన్ కు తెలుగువారే సినిమాలకు పరిచయం చేశారా నాయనా ఇది మరీ కామెడీగా లేదు. తెలిస్తే తెలుసని చెప్పాలని లేదంటే తేదు. అయినా బాలీవుడ్ యాక్టర్స్ గురించి మనకు అవసరమా విష్ణు అంటూ కామెంట్స్

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here