Bigboss Priyanka : తిరుపతి మెట్ల దారిలో బిగ్ బాస్ ప్రియాంక, శివలపై చిరుత దాడి.. ఆందోళనలో ఫ్యాన్స్

- Advertisement -

Bigboss Priyanka : బుల్లితెర నటి ప్రియాంక, శివ కుమార్ మౌనరాగం సీరియల్‌లో కలిసి నటించారు. అప్పుడే ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరు అప్పటినుంచే తమ రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే శివ కుమార్ పలు సీరియల్స్ ఈవెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రియాంక ఇటీవల తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 షోలో పాల్గొని తన పాపులారిటీ అమాంతం పెంచుకుంది. అంతేకాకుండా తన జోష్ ఫుల్ ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాష్ షోలో టాప్ 5కు చేరింది.. దురదృష్టవశాత్తు విన్నర్ కాలేకపోయింది. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక ఏ సీరియల్ ఒప్పుకోకుండా పలు షోస్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు చేరువగానే ఉంది.

priyanka jain shiv

తాజాగా, ప్రియాంక తన ప్రియుడు శివ కుమార్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తిరుపతికి వెళ్లింది. సాయంత్రం పూట మెట్ల దారిపై నడిచి ఏడుకొండల వాడి దర్శనం చేసుకుంది. అయితే ఈ క్రమంలోనే మెట్లు ఎక్కుతుండగా మధ్యలో వారికి చిరుత కనిపించింది. దీంతో వీరిద్దరు పరుగులు పెట్టారు. అంతేకాకుండా భయపడి కేకలు కూడా పెట్టారు. ఆ తర్వాత గట్టిగా ఒకరినొకరు పట్టుకొని చిరుత నుంచి తప్పించుకున్నామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఓ చోట ఆగి ప్రియాంకను శివ నువ్వు అందరినీ భయపెట్టడానికి వచ్చావా అని అంటాడు. అప్పుడు లేదు.. నువ్వే భయపెట్టావు అంటుంది. దీంతో శివ నేను ఏదో చూసి అంటే.. చిరుత అని రన్నింగ్ చేస్తావా అంటాడు. ఇక అప్పుడు దూరంగా ఉన్న కారు హెడ్ లైట్స్ నాకు దూరం నుంచి చీతా కళ్లలాగే అనిపించాయి. అందుకే చిరుత అనుకుని భయపడిపోయాను అందుకే పరుగులు పెట్టానని చెప్పింది.

- Advertisement -

Priyanka Jain

ఆ తర్వాత దేవుడిని దర్శించుకుని ఓ హోటల్‌కు వెళ్లి మ్యాగి తినేసి వెళతారు. అంతా వీడియో తీసి ఈ జంట యూట్యూబ్ చానల్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా దానికి మా మీద చిరుత దాడి చేసిందనే థంబ్‌నెయిల్ పెట్టారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు బాగుంది మీ పెళ్లి కూడా అక్కడే జరగాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ‘‘ఫస్ట్ మీరు థంబునైల్ మార్చండి తిరుమల వెళ్ళే భక్తులకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ తిరుపతి వెళ్లే భక్తులను భయాందోళన గురి చేయకండి నీకేమన్నా చేతనైతే భక్తితో మంచి వీడియోలు పెట్టండి. అంతేకానీ భయాందోళన గురి చేసే వీడియోలు పెట్టకండి’’ అని కామెంట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here