Meenakshi Chaudhary: గురూజీ చేతిలో పడిందిగా.. మీనాక్షి చౌదరిపై నెటిజన్‌ వైరల్‌ కామెంట్

- Advertisement -

ఒక్క సినిమాతోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ. ఎవరు అనుకుంటున్నారా? అదే నండి మీనాక్షి చౌదరి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టిన గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. మీనాక్షి చౌదరి ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి లేటెస్ట్ మూవీలో ఈ భామకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవతగా కనిపించనుందని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది కాకుండా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఈ పాన్-ఇండియన్ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ సినిమాలోనూ మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో మీనాక్షి చౌదరి ఫాలోయింగ్ కూడా అనూహ్యంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఈ భామ బికినీలో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చింది. బికినీలో అందాల విందు చేసింది. తన గ్లామర్ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేసింది. . దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గురూజీ చేతిలో పడితే ఏ హీరోయిన్ దశ అయినా మారిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కామెంట్స్‌ పై ఈ హీరోయిన్‌ అయితే అస్సలు స్పందించలేదు మరి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here