Madhi Movie: మీ ఫస్ట్‌ లవ్‌ గుర్తుందా.. అయితే ‘మది’ మూవీ చూసేయండిMadhi Movie: సినిమాపై ఉన్న పిచ్చి చాలా మంది యువతీయువకులను ఈ రంగుల ప్రపంచంలోకి లాగుతోంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతమంది మాత్రమే నిలదొక్కుకోగలుగుతున్నారు. ఈ బ్యూటీ వరల్డ్‌లో సర్వైవ్ అవ్వాలంటే అందం, నటన మాత్రమే కాదు చాలా సహనం ఉండాలి. కాస్త లక్కు కూడా ఉండాలి. అలా  సినిమాపై ఉన్న ప్రేమతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు హైదరాబాద్ యువకుడు శ్రీరామ్ నిమ్మల. ఉత్తర అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చూస్తూ వెళ్తున్నాడు ఈ యంగ్ హీరో.

ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ బ్లూస్, రుద్రవీణ తెలుగు సినిమాలతో సందడి చేశాడు శ్రీరామ్. ఇప్పడు మది అనే ఓ ఫీల్‌గుడ్ లవ్‌ స్టోరీతో మనమందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. రిచా జోషితో జంటగా శ్రీరామ్ నటిస్తున్న మూవీ ‘మది’ మూవీ రేపే(నవంబర్ 11)న విడుదుల కాబోతోంది. నాగధనుష్‌ దర్శకత్వం వహించారు. రామ్‌కిషన్‌ నిర్మాత. పీవీఆర్‌ రాజా స్వరకర్త. యువతరానికి నచ్చే మంచి కథతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ‘మది’లో ఉన్నాయని చిత్ర బృందం చెబుతోంది.

ఈ మూవీతో పాటు ఈ ఏడాది శ్రీరామ్ మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. తురుమ్ ఖానులు, అనుకున్నవన్నీ జరగవు కొన్ని అనే సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.