Lavanya Tripathi : ఈ అందాల రాక్షసి అందాలు చూడతరమా..!

- Advertisement -

అందాల రాక్షసితో టాలీవుడ్ కి పరిచయమైంది Lavanya Tripathi . తన సొట్టబుగ్గలతో అమాయకమైన చూపుతో తొలిమూవీతోనే కుర్రకారు మదిని దోచేసింది. ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. ఈ చదువులూ అవీ నా వల్ల కావడం లేదు.. పైగా ఒంటరిగా నిద్రకూడా పట్టట్లేదు’ అంటూ అమాయకమై మాటలతో నేటితరం అమ్మాయిల మనసులో మాటను చెప్పేసింది.

Lavanya Tripathi saree Photos
Lavanya Tripathi saree Photos

ఈ మువీ రిలీజ్ అయిన సమయంలో ఈ డైలాగ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఈ సొట్ట బుగ్గల సుందరి ఎన్ని సినిమాలు చేసినా.. తన కెరీర్ లో ది బెస్ట్ డైలాగ్ గా ఈ ఇది నిలిచిపోయింది.

Lavanya Tripathi Images
Lavanya Tripathi Images

ఈ సినిమా తర్వాత మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు ఇచ్చింది లావణ్య. ఈ మూవీస్ తర్వాత లావణ్యకు చెప్పుకోదగ్గ సినిమాలేం లేవు. వరుసగా ప్లాఫ్ లే వచ్చాయి. అయినా ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. రీసెంట్ గా హ్యాపీ బర్త్ డే మూవీతో వచ్చినా.. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. సరైన హిట్లేం లేకపోయినా.. ఈ బ్యూటీకి ఆఫర్లకు మాత్రం కొదవలేదు.

- Advertisement -

Lavanya Tripathi Photos

ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. కోన వెంకట్ తెరకెక్కిస్తున్న జీ5 ఒరిజినల్ సిరీస్ పులిమేకలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఓ తమిళ మూవీలో అధర్వకు జోడీగా కూడా నటిస్తోంది. ఇవే కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మంజునాథ డైరెక్ట్ చేస్తున్న తెలుగు మూవీకి కూడా పచ్చజెండా ఊపేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here