Sonakshi Sinha : దబంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోయగాలు

- Advertisement -

‘తప్పడ్‌ సే డర్ నహీ లగ్‌తా సాబ్.. ప్యార్‌ సే లగ్‌తా’ అంటూ కుర్రకారు మదిని దోచేసింది Sonakshi Sinha . బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ నటించిన దబంగ్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. శత్రుఘ్న సిన్హా కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ని క్రియేట్ చేసుకుంది.

ఓవైపు గ్లామర్‌ రోల్స్ చేస్తూనే మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈ భామ హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కూడా చేసింది.

Sonakshi Sinha
Sonakshi Sinha

తన నటనతో బాలీవుడ్​లో సత్తా చాటుతూ.. ఎప్పటికప్పుడు లేటెస్ట్​ ఫొటోషూట్​ల్లో అందాలు ఆరబోస్తోంది.

- Advertisement -

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో బొద్దుగా ముద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు స్లిమ్‌గా తయారై తన అందాలతో కుర్రకారుని కట్టిపడేస్తోంది.

తాజాగా బ్లూ అండ్ వైట్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను సోనా పోస్ట్​ చేసింది. ఈ ఫొటోల్లో సోనాక్షిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Sonakshi Sinha Pictures
Sonakshi Sinha  

సోనాక్షి లేటెస్ట్ మూవీ డబుల్ XL గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సోనాక్షి, హుమా ఖురేషీ కలిసి నటించారు.

డబుల్ XL సైజ్ ఉన్న ఇద్దరు మహిళలు వారి కలలు సాకారం చేసుకునే క్రమంలో సమాజంలో ఎదుర్కొన్న అడ్డంకులను ఎలా అధిగమించారన్నదే ఈ సినిమా స్టోరీ.

Sonakshi Sinha

సోనాక్షి సిన్హా బాలీవుడ్ యాక్టర్ జహీర్ ఇక్బాల్‌తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. బీ టౌన్‌లో ఏ పార్టీకైనా ఇద్దరు కలిసే వెళ్లడం.. డిన్నర్ డేట్స్, వెకేషన్స్‌కి వెళ్తుండటంతో వీళ్లిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి బ్లాక్‌బస్టర్ అనే సాంగ్‌లో నటించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here