అందంలోనే కాదు చదువులోనూ ఈ బ్యూటీస్ నంబర్ వన్‌

- Advertisement -

బ్యూటీ విత్ బ్రెయిన్ డెడ్లీ కాంబినేషన్. చాలా మంది హీరోయిన్లు చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చామని అందుకే చదువుని నిర్లక్ష్యం చేశామని చెబుతుంటారు. కొందరేమో చదువుతూ సినిమాలు చేస్తుంటారు. మరికొందరేమో ఉన్నత చదువులు చదివి మూవీస్‌లోకి వచ్చారు. టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిపోతున్న హీరోయిన్లు ఉన్నత చదువులు చదివారు. అలా అందంలోనే కాదు చదువులోనూ నంబర్‌ వన్‌గా నిలిచిన కొందరు ముద్దుగుమ్మలు ఏం చదువుకున్నారో తెలుసుకుందామా..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో నంబర్ వన్ పొజిషన్‌లో ఉంటుంది సమంత. చిన్నప్పటి నుంచి మన జెస్సీ చాలా షార్ప్ అట. సామ్ చెన్నైలో బీకామ్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్.. వెంటనే సినిమాలు.. ఇక మిగతాదంతా హిస్టరీయే.

- Advertisement -

మేడం సార్ మేడం అంతే.. అదేనండి పూజా హెగ్డే.. వరుస బ్లాక్‌బస్టర్స్ అందిస్తూ దూసుకెళ్తోన్న ఈ భామ కామర్స్‌లో పూజీ పూర్తి చేసింది. కాలేజ్ డేస్‌లో కల్చరల్ యాక్టివిటీస్‌లో ఈ బుట్టబొమ్మకు సాటి ఎవరూలేరట.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మాస్ మీడియాలో బీఏ చేసింది. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసి.. ఆ తర్వాత లక్ష్మీ కళ్యాణం మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

మహానటి కీర్తి సురేశ్ నటనలోనే కాదు చదువులోనూ నంబర్ వన్. కీర్తి ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించినా.. కీర్తి చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయలేదు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆర్ట్స్ స్టూడెంట్. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్.. కోలీవుడ్‌లను ఒక ఊపు ఊపేస్తున్న ఈ భామ.. సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ చేసింది.

ఫిట్‌నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్‌సింగ్ బీఎస్సీ చదివింది. 2009లో విడుదలైన జల్లి మూవీతో వెండితెరకు పరిచయమైన రకుల్.. ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా ఆర్ట్స్ స్టూడెంట్. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసింది. చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో ఈ భామ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here