Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో లిప్ లాక్ సీన్.. చిరంజీవి OR రవితేజ లక్ ఎవరిదో..?

- Advertisement -

టాలీవుడ్‌ స్టార్​ హీరో మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ Waltair Veerayya . మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్‌ లాంఛ్‌ చేసిన టైటిల్‌ టీజర్‌, బాస్ పార్టీ సాంగ్‌ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశాయి. చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక మాస్ మహారాజ్ రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన విక్రమ్ సాగర్ ఏసీపీ గా కనిపించనున్నారు. రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ దుమ్మురేపింది. చేతిలో మేకపిల్లతో వచ్చి విధ్వంసం చేశాడు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ఆయన తెలంగాణ యాసతో రవితేజ మామూలు రచ్చ చేయలేదు. ఇక మూవీలో రవితేజ ఎంత రచ్చ చేస్తాడో చూడాలంటే జనవరి వరకు వేచి చూడాల్సిందే.

ఇప్పటికే ఈ టీమ్ సర్ ప్రైజ్ మీద సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ మూవీలో గాఢమైన లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయట. మాస్ హీరోలు అందులోనూ వయసులో పెద్దవాళ్లైన చిరంజీవి-రవితేజ నటిస్తున్న మూవీలో లిప్ లాక్ సన్నివేశాలు ఏంటని అటు టాలీవుడ్ జనాలు ఇటు ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చిరు, రవితేజలలో ఎవరు హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ చేస్తున్నారనే ఉత్కంఠ రేగుతోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం తమ హీరోలు ఏం చేసినా.. సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

- Advertisement -
Waltair Veerayya
Waltair Veerayya

వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. ఇక రవితేజతో కేథరిన్ థెరిస్సా నటిస్తోంది. కథ రీత్యా రవితేజ-కేథరిన్ మధ్య గాఢమైన లిప్ లాక్ సన్నివేశం ఉంటుందట. ఆ సన్నివేశంలో రవితేజ, కేథరిన్ మొహమాటం లేకుండా నటించారంటూ విశ్వసనీయవర్గాల సమాచారం. మరి చిరంజీవి మూవీలో రవితేజ ముద్దు సీన్ ఏ స్థాయిలో రొమాన్స్ పంచిందో చూడాలి. 

దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. విడుదలైన బాస్ పార్టీ సింగిల్ దుమ్మురేపుతోంది. వాల్తేరు వీరయ్య మూవీపై పరిశ్రమలో మంచి హైప్ నెలకొంది. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here