మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi .. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను శాసించే స్థాయికి ఎదిగారు. టాలీవుడ్ అగ్రనేతగా దశాబ్ధాల నుంచి తిరుగులేని చక్రవర్తిగా నిలిచారు. ఆరు పదుల వయసు దాటుతున్నా.. ఎవర్గ్రీన్ హ్యాండ్సమ్గా తెలుగు తెరపై ప్రేక్షకులను కనువిందు చేస్తున్నారు. 67 ఏళ్ల వయసులోనూ ఏ యంగ్ హీరోకూ తీసిపోని ఛార్మింగ్ ఫేస్‌తో.. అంతకన్నా ఎనర్జిటిక్‌గా యాక్టింగ్ చేస్తూ.. యంగ్ హీరోలకు పోటీనిస్తూ డబుల్ ఎనర్జీతో స్టెప్పులేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవీయే పెద్ద దిక్కని చెప్పొచ్చు. సీనియర్ హీరోలను.. నేటి యంగ్ జనరేషన్‌ను ఒకేతాటిపై నడిపించడంలో మెగాస్టార్ పాత్ర కూడా ఉంది. ఈ మెగా హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మూడు దశాబ్ధాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ డబుల్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు.
కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చిరంజీవి ఎన్నో అద్భుత చిత్రాల్లో నటించారు. ఈ మెగాస్టార్ సినీ కెరీర్లో ఎన్నో మరుపురాని చిత్రాలు ఉన్నాయి. తన కో స్టార్ అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను పెళ్లి చేసుకున్నారు చిరంజీవి. ఈ మామా అల్లుళ్లు తెరపై చేసిన మ్యాజిక్ తెలుగు తెరపై చిరకాల స్థాయిలో నిలిచిపోయింది. అల్లు రామలింగయ్యకు అల్లు అరవింద్, సురేఖ సంతానం. టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంటే అల్లు రామలింగయ్యకు ఎంతో ఇష్టం.
ఇక ఈ మెగాస్టార్ కష్టపడే తత్వం చూసి రామలింగయ్య ఫిదా అయ్యారు. అందుకే తన కుమార్తెను కూడా ఏ కష్టం లేకుండా చూసుకుంటాడని భావించి చిరంజీవికి తన కుమార్తె సురేఖను ఇచ్చి 1980లో వివాహం జరిపించారు. అలా మన మెగాస్టార్ అల్లువారి అల్లుడయ్యారు. అలా కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అప్పటి నుంచి బంధువులయ్యారు. చిరంజీవి తన వ్యక్తిగత విషయాల గురించి తన పెళ్లి గురించి పలు వేదికల మీద అభిమానులతో చాలా సార్లు పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్ సక్సెస్‌లో తన భాగస్వామి సురేఖ పాత్ర చాలా కీలకమని తెలిపారు. షూటింగ్స్‌లో తాను బిజీగా ఉన్నా తమ పిల్లలు సుస్మిత, శ్రీజ, రామ్‌చరణ్‌ల బాధ్యత తానే చూసుకుందని.. చాలా సపోర్టింగ్‌గా నిలిచిందని చెప్పారు.
C వీరి వివాహం 1980లో ఫిబ్రవరి 20న జరిగింది. మరో రెండు నెలల్లో వీరి వివాహ బంధం 42 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చిరంజీవి-సురేఖల వివాహ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది. అయితే ఇది వీరి పెళ్లి జరిగినప్పటి వివాహ పత్రికేనట. చిరంజీవి సురేఖ పెళ్లి పత్రిక ఇంగ్లీష్ అక్షరాలతో స్టైల్ ఫాంట్‌తో ప్రింట్ అయిన పెళ్లి పత్రిక చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ కాలంలోనే చాలా కాస్ట్లీ వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయించారని కామెంట్లు పెడుతున్నారు.
ఇక మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నాగబాబు సినిమాలు, సీరియళ్లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ మరోవైపు ప్రొడ్యూసర్‌గా చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సోదరి సపోర్ట్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పవర్ స్టార్ ఇమేజ్ సంగతి తెలిసిందే. తనకు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉండేలా పవన్ కల్యాణ్ నడుచుకుంటున్న తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమే. ఇక ఈ హీరో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌కు నాగబాబు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
మరోవైపు చిరంజీవి పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల తెర వెనుక పనిచేస్తున్నారు. ఆమె స్టైలిస్ట్‌గా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. మరోవైపు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి వెబ్ సిరీస్‌లు, సినిమాలు నిర్మిస్తున్నారు.