Jr NTR రేంజ్ అంటే ఇదే! అవార్డు రాలేదని ఎగతాళి చేసారు.. కానీ ఏకంగా

- Advertisement -

JR NTR గడిచిన కొంతకాలం నుండి #RRR సినిమాకి అంతర్జాతీయ అవార్డ్స్ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ, మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపజేసిన సంగతి తెలిసిందే.ఇది కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు,ప్రతీ భారతీయుడు ఎంతో గర్వించాల్సిన విషయం.మన ప్రతిభ ని చూసి జేమ్స్ కెమరూన్ వంటి దిగ్గజాలే మెచ్చుకుంటున్న ఈ సందర్భంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా చేసుకుంటున్న ఫ్యాన్ వార్స్ మన స్థాయిని తగ్గించేలా చేస్తున్నాయి.

JR NTR
JR NTR

అసలు విషయానికి వస్తే #RRR సినిమాకి రీసెంట్ గా HCA (హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్’ నిర్వహించిన అవార్డ్స్ ఈవెంట్ లో ఏకంగా 5 అవార్డులను గెల్చుకొని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి రామ్ చరణ్ , రాజమౌళి మరియు కీరవాణి వంటి వారు హాజరు కాగా , తారకరత్న చనిపోయిన కారణంగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేకపోయాడు.

ram charan

ఎన్టీఆర్ రాకపోయినందుకు గాను HCA అందించిన స్పెషల్ స్పాట్ లైట్ అవార్డు ఆయనకీ ఇవ్వలేదు.కానీ రామ్ చరణ్ – రాజమౌళి కి మాత్రం ఆ అవార్డు దక్కింది.దీనితో సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ని ఆయన ఫ్యాన్స్ ని ట్రోల్ చెయ్యడం ప్రారంభించారు.ఇదంతా గమనించిన #RRR మూవీ టీం HCA అవార్డ్స్ టీం తో మాట్లాడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి వివరణ ఇప్పించింది.’ఎన్టీఆర్ ని మేము ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి ఆహ్వానించామని, కానీ ఇండియా లో ఆయనకీ షూటింగ్ ఉండడం తో ఇక్కడకి రాలేకపోయాడని.కానీ అమెరికా కి వచ్చినప్పుడు ఆయనకోసం మేము తీసిపెట్టిన అవార్డుని ఇస్తాము’ అంటూ ఒక ట్వీట్ వేశారు.

- Advertisement -

నిన్న మొన్నటి వరకు మమల్ని ఎగతాళి చేసారు కదా, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ అవార్డ్స్ సంస్థ వాళ్ళే మా పవర్ కి తట్టుకోలేక క్రిందకి దిగొచ్చారు అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ధమ్కీ ఇస్తున్నారు.ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ నెల 12 వ తారీఖున జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు అమెరికాకి ప్రయాణం కానున్నాడు.మార్చి 5 వ తేదీన ఆయన అమెరికా కి చేరుకుంటాడని తెలుస్తుంది.అంగరంగ వైభవం గా జరగబోతున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ‘నాటు నాటు‘ పాటకి ఆస్కార్ అవార్డు దక్కుతుందో లేదో చూడాలి.

Ram Ntr
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here