Jigarthanda Double X : ‘జిగర్ తాండా డబల్ X’ మూవీ ఫుల్ రివ్యూ..ఇలాంటి స్క్రీన్ ప్లే ఎక్కడా చూసుండరు!

- Advertisement -

నటీనటులు : రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య, నిమిషా సజయన్, షైన్ టామ్ చాకో, సత్యన్ తదితరులు

రచన – దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాత : కార్తికేయన్ సంతానం

Jigarthanda Double X : వరుణ్ తేజ్ హీరో గా నటించిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రాన్ని మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమా తమిళం లో సిద్దార్థ్ హీరో గా నటించిన ‘జిగర్ తాండా’ చిత్రానికి రీమేక్. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో ‘జిగర్ తాండా డబల్ X’ చిత్రం రూపొందింది. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు తెలుగు మరియు తమిళం భాషల్లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. దానికి తోడు మాస్ ఆడియన్స్ లో మంచి ఇమేజి ఉన్న లారెన్స్ హీరో అవ్వడం, తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మామూలు గా ఉండే యావరేజి సినిమాలను కూడా సూపర్ హిట్ రేంజ్ కి తీసుకెళ్తున్న ఎస్ జె సూర్య ప్రధాన పాత్ర పోషించడం, ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడడానికి కారణం అయ్యాయి. అలా భారీ అంచనాల నడుమ దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.

- Advertisement -
Jigarthanda Double X
Jigarthanda Double X

కథ :

అది 1975 వ సంవత్సరం. ఒక రౌడీ (లారెన్స్) కి సినిమా థియేటర్ ప్రాంగణం లో జరిగిన ఒక గొడవ కారణంగా ఎలా అయినా సినిమాల్లో హీరో అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ హీరో అవ్వడానికి ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఆ రౌడీ కి లేదు. నల్లని రూపం ఉన్న ఆ రౌడీ నేను సినిమా హీరో అవుతాను అంటే చుట్టుపక్కన ఉన్నవాళ్ళంతా నవ్వుతారు. అలా నవ్వడం తో అవమానం ఫీల్ అయిన ఆ రౌడీ ఎలా అయినా సినిమా హీరో అయ్యి వీళ్ళందరికీ తన రేంజ్ ఏంటో చూపించాలి అనుకుంటాడు. తనని హీరోగా పెట్టి సినిమా తీసే దర్శకుడి కోసం అన్వేషిస్తున్న సమయం లోనే ఒక డైరెక్టర్ (ఎస్ జె సూర్య) దొరుకుతాడు. ఇతనిలో మంచి దర్శకత్వ ప్రతిభ ఉంది. ఆ ప్రతిభ తగ్గ గుర్తు కోసం పరితపిస్తున్న సమయం లో ఈ నల్లని రౌడీ పరిచయమై తనతో సినిమా తియ్యల్సిందిగా పట్టుబడుతాడు. మొదట్లో ఆ డైరెక్టర్ ఒప్పుకోడు, కానీ ఒక రౌడీ బ్యాక్ డ్రాప్ ఉన్న వ్యక్తిని హీరోని చేస్తే కచ్చితంగా ఆడియన్స్ లో ఆసక్తి కలుగుతుంది అనే పాయింట్ ని నమ్మి రౌడీ తో సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటాడు. అయితే ఇతన్ని ఎలాంటి కథలో చూపించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు డైరెక్టర్. ఈ క్రమం లో ఆ రౌడీ కొన్ని అనుకోని సంఘటనల కారణం గా మంచోడిగా మారుతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది?, హీరో అవ్వాలనే ఆ రౌడీ కోరిక నెరవేరిందా లేదా అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

కార్తీక్ సుబ్బరాజ్ సినిమాల నుండి స్టోరీ ని ఆడియన్స్ పెద్దగా ఆశించరు. కానీ స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ పై అంచనాలు భారీ గా పెట్టుకుంటారు. ఆయన ఫిల్మోగ్రఫీ ఒక్కసారి పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ చిత్రం తో కార్తీక్ సుబ్బరాజ్ ఆడియన్స్ లో ఏర్పడిన ఆ అంచనాలను అందుకోవడం లో సక్సెస్ అయ్యాడు అనే చెప్పాలి. ఈ చిత్రం లో ఆయన టేకింగ్, చిన్న చిన్న సన్నివేశాలకు కూడా ఆయన ఇచ్చిన డిటైలింగ్ అదిరిపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ చిత్రం లో లారెన్స్ మరియు రాజకీయ నాయకుడి మధ్య వచ్చే ముఖ్యమైన పోరాటసన్నివేశాల్లో ఎలివేషన్స్ అద్భుతంగా రాసుకున్నాడు. ఇవి థియేటర్ లో చూసే ఆడియన్స్ కి మంచి అనుభూతిని కలిగిస్తుంది. రౌడీ గా లారెన్స్ అదరగొట్టేసాడు. సినిమా చూస్తున్న పది నిమిషాలకే ఆయన క్యారక్టర్ ఆడియన్స్ కి బాగా ఎక్కుతాది.

కానీ లారెన్స్ కి ఇచ్చిన డబ్బింగ్ వాయిస్ మాత్రం ఆడియన్స్ కి ఎక్కలేదు. ఇక ఎస్ జె సూర్య గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది. ఆయన ఏ సినిమాలో ఉంటే,ఆ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాకి కూడా ఆయన అలాగే మారాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి పెద్దగా ఉపయోగపడకపోయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం మాత్రం డ్యూటీ అదరగొట్టేసాడు. ముఖ్యంగా ఎలివేషన్ సన్నివేశాల్లో సంతోష్ నారాయణ్ తన విశ్వరూపం చూపించేసాడనే చెప్పాలి. ఈ సినిమాకి ఉన్న మెయిన్ మైనస్ ఏమిటంటే కథలో డెప్త్ లేకపోవడమే. కేవలం క్యారెక్టర్స్ మీదనే ఆధారపడిన స్క్రీన్ ప్లే ఇది.అలాగే చాలా సన్నివేశాలు ల్యాగ్ అవ్వడం వల్ల ప్రేక్షకులు బోరింగ్ ఫీల్ అవుతారు.

చివరి మాట :

ఓవరాల్ గా ఈ వీకెండ్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలలో ఇది ఒకటి. ప్రేక్షకులు ఫుల్ గా ఎంజాయ్ చేసి బయటకి రావొచ్చు.

రేటింగ్ : 2.75 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here