Tamanna : పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న తమన్నా.. ఏంటి కర్మ అంటున్న నెటిజన్స్

- Advertisement -

Tamanna : స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుసగా సినిమాల్లో నటిస్తూ దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో తన హవా చాటుతోంది. కొన్నేళ్లుగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేసి నెట్టింట్లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. అయితే తమన్నా 2005లో మంచు మనోజ్ తో కలిసి ‘శ్రీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో హిట్ చిత్రాలు చేసి జనాలను అలరించింది. అంతేకాకుండా, టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకుంది. 2023లో జైలర్, లస్ట్ స్టోరీస్‌ 2 అనే వెబ్ సిరీస్ చేసి రెండు హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు బాక్, ఓదెల-2 వంటి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది.

అయితే తమన్న వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తొందరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. నిత్యం ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ అక్కడ కెమెరాకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, తమన్నా భాటియాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. పెళ్లి కాకముందే ఆమె తల్లి కాబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తమన్న-విజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. పెళ్లి కాకముందే ఓ బిడ్డను వారిద్దరు డిసైడ్ అయినట్లు టాక్.

- Advertisement -

ఒకరిని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని.. బాధ్యతలు తెలుస్తాయని వీరిద్దరి మధ్య ఒప్పందం జరిగిందట. ఈ విషయం బయటకు రావడంతో అది తెలుసుకున్న నెటిజన్లు పెళ్లి కాకముందే పేరెంట్స్ కావాలని కోరుకోవడం ఏంటని? చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియనప్పటికీ ప్రస్తుతం తమన్నా వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె అభిమానులు మాత్రం వాటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. ఆమె వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం తప్పని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here