Rashmika Mandanna : 58ఏళ్ల వయసున్న హీరోతో రొమాన్స్ కు రెడీ అయిన రష్మిక

- Advertisement -

Rashmika Mandanna : రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది రణబీర్ కపూర్‎కు జోడిగా యానిమల్ సినిమాలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టేసింది. ఇప్పుడు అదే జోష్ తో మరో బంఫర్ ఆఫర్ పట్టేసిందని తెలుస్తోంది.

సల్మాన్‌ ఖాన్‌ నటించిన సికందర్‌ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఆయన అభిమానులు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. విశేషమేమిటంటే 2025 ఈద్ సందర్భంగా సికందర్ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో సల్మాన్ సరసన ఎవరు నటిస్తారోనని అభిమానులు ఇంతకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం కూడా బట్టబయలైంది. సికందర్‌లో రష్మిక మందన్న నటించనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.

- Advertisement -

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సాజిద్ నదియద్వాలా ప్రొడక్షన్ హౌస్‌లో సికందర్ రూపొందుతోంది. పుష్ప, యానిమల్ సక్సెస్ తర్వాత రష్మిక ఇప్పుడు మొదటిసారి సల్మాన్ ఖాన్‌తో కలిసి పని చేయబోతోంది. రష్మిక మందన్నకు సాజిద్ నదియాడ్‌వాలా కథ చెప్పిన వెంటనే, ఆమె తన పాత్ర గురించి చాలా ఎక్సైట్ అయ్యింది. వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేసుకుంది. సికందర్ కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదు. ఇది డ్రామా, భావోద్వేగాలతో నిండిన చాలా బలమైన కథ. సల్మాన్, రష్మిక ఇద్దరూ సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. జూన్ నుండి సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారు. సల్మాన్‌, సాజిద్‌ మరోసారి సికందర్‌ కోసం కలిసి వస్తున్నారు. ఇంతకు ముందు వీళ్లిద్దరూ కిక్‌లో కలిసి పనిచేశారు. రష్మిక యానిమల్ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె పుష్ప 2 సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక లుక్ కూడా రివీల్ అయింది. ఈ చిత్రం ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here