Srivedi : శ్రీదేవి చెల్లిని చూశారా.. ఆ ఒక్క సంఘటన తన అక్క చనిపోయినా రాలేనంత దూరం చేసింది

- Advertisement -

Srivedi : రిలేషన్ షిప్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. రక్త సంబంధం చనిపోయే వరకు తోడుగా ఉంటుందన్నారు. కానీ కలికాలంలో ఆ బంధం కూడా చెడిపోతుంది. డబ్బుతో నడిచే ఈ సమాజంలో బంధాలు బలహీనపడుతున్నాయి. ప్రపంచంలోనే అందాల సుందరి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె భారతదేశంలోని సినీ అభిమానులందరికీ నచ్చింది. ఇప్పటికీ ఆమె రూపాన్ని ఎవరూ మర్చిపోలేరు. శ్రీదేవి జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు ఇప్పటికే చాలా మందికి తెలుసు. ఆమె కెరీర్‌ని ఎలా స్టార్ట్ చేసింది, ఏ సినిమా నుంచి స్టార్ట్ చేసింది, ఎన్ని సినిమాలు చేసింది అనే విషయాలు కూడా ఇంచుమించుగా అందరికీ తెలుసు. 300లకు పైగా సినిమాల్లో నటించిన శ్రీదేవి పదహారేళ్ల వయసులో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది.

చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏ వయసులో కూడా శ్రీదేవి అబ్బా ఏం చూస్తాంలే అనే నిరుత్సాహాన్ని కలిగించేలా ఏనాడు కనిపించలేదు. బాలనటిగా మెప్పించింది.. హీరోయిన్ గా అదరగొట్టింది.. అప్పటి కుర్ర హీరోలైన నాగార్జున, వెంకటేశ్ లాంటి వాళ్లతో కూడా నటించి మెప్పించింది. ఇంగ్లీష్ వింగ్లీష్ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. అదే శ్రీదేవి గొప్పతనం. శ్రీదేవి జీవితంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. తమిళనాడులోని మీనంపాటి గ్రామంలో రాజేశ్వరి, అయ్యప్పన్ దంపతులకు శ్రీదేవి జన్మించింది. శ్రీదేవి తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు. వారిలో పెద్దది శ్రీదేవి.. రెండో కూతురు శ్రీ లత. షూటింగ్‌లలో ఎప్పుడూ శ్రీదేవితో కలిసి ఉండేవారు. అక్కంటే ప్రాణంగా ఉండేంది శ్రీలత.. కానీ కాలం గడిచే కొద్ది వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

- Advertisement -

శ్రీదేవి తల్లి చనిపోయే ముందు ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తప్పుగా చేయడం వలన ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయి చనిపోయింది. ఆ తర్వాత ఆ హాస్పిటల్‌పై కేసు పెట్టిన శ్రీదేవికి కొంత డబ్బు కూడా వచ్చింది. కానీ జ్ఞాపకశక్తి లేకపోవడంతో ఆ డబ్బును, అలాగే తమ తల్లి ఆస్తిని శ్రీదేవి తీసుకుందని శ్రీలత కోర్టులో కేసు వేసింది. అప్పట్లో కేసు గెలిచి రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డబ్బుల కోసం గొడవ పడడంతో ఇద్దరూ అక్కడి నుంచి కలవలేకపోయారు. ఆఖరికి శ్రీదేవి చనిపోయాక కూడా ఆమె రాలేదని చాలా వార్తలు వచ్చాయి. సెలబ్రిటీల జీవితాల్లో కూడా డబ్బు కోసమే ఇలాంటివి జరుగుతాయన్న విషయం తెలిసి నేటితరం జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here