Devara : ఫ్యాన్స్ కు షాక్.. అర్థాంతరంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ దేవర షూటింగ్

- Advertisement -

Devara : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లో ఇరగదీస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. అలాంటి వారితో అందరి కంటే ముందున్నాడు జూ.ఎన్టీఆర్. సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇటీవల కాలంలో హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న సినిమా ‘దేవర’. ఈ మూవీని కోస్టల్ ఏరియా నేపథ్యంతో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని క్రేజీగా తీస్తున్నారు. అందుకే ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అర్థాంతరంగా చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ఆపేసినట్లు తెలుస్తోంది. అసలు మేటర్ లోకి వెళితే..

సాధారణంగా సినిమా అంటేనే రిస్క్ తో కూడుకున్నది. అలాంటి సినిమా చిత్రీకరణ సమయంలో ప్రమాదాలు జరగడం సహజమే. సినిమా హీరోలు రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు, ఫైట్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు గాయాలవుతూ ఉంటాయి. సినిమా హీరోలు అభిమానుల కోసం రిస్క్ అయినా పర్లేదని చేస్తున్నారు. ఈ క్రమంలో గాయాలపాలవుతున్నారు. తాజాగా దేవర మూవీ షూటింగ్ లో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైనా అయిందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మోదకొండమ్మ పాదాల వద్ద చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా యూనిట్ సభ్యులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 20 మంది యూనిట్ సభ్యులకి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో తారక్ కి ఏమైందో అని కంగారు పడుతున్నారు. అయితే ఆ సమయంలో తారక్ షూటింగ్ స్పాట్లో లేడని తెలుస్తోంది. ఆ సంఘటన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున వర్షం కురవడంతో ఈరోజు షూట్ నిలిచిపోయిందని అంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here