Janhvi Kapoor : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..బాలివుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోని ఇప్పుడు తెలుగు లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది..అయితే అక్కడ ఒక్క సినిమా తప్ప మిగిలిన సినిమాలు పెద్దగా సక్సెస్ ను అందుకోలేదు..అయినా కూడా ఇన్నాళ్లు అక్కడే సినిమా లు చేయాలని జాన్వీ కపూర్ భావించింది. ఎట్టకేలకు ఆమె తీరు లో మార్పు వచ్చింది. వరుసగా సినిమాలు చేయాలి అనుకున్న జాన్వీ కపూర్ కు అక్కడ ఆశించిన స్థాయిలో సినిమా ల్లో ఆఫర్లు రావడం లేదు. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు జాన్వీ కపూర్ కు కోటి రూపాయలకు పైగా పారితోషికం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధం అయ్యారు..
అయితే తెలుగులో మాత్రం అమ్మడుకు కోటి లోపు ఇస్తున్నారని తెలుస్తుంది..బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్ లు పడటంతో తెలుగులొ కూడా ఈ అమ్మడి క్రేజ్ తగ్గిందని.. అందుకే తక్కువ పారితోషికం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ 30 లో జాన్వీ కపూర్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆమె కు 80 లక్షల రూపాయల పారితోషికంతో పాటు పది లక్షల రూపాయల ఇతర అలవెన్స్ లు స్టాఫ్ ఖర్చులు ఇస్తున్నారని తెలుస్తోంది. అంటే కోటికి లోపే జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ ఉందని తెలుస్తుంది..
ఎన్టీఆర్ 30 సినిమాలో ఆమె నటించి సక్సెస్ దక్కించుకుంటే అప్పుడు మళ్లీ కోటిన్నర వరకు ఈమె పారితోషికం డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు. తెలుగులో ఈమెకు మంచి డిమాండ్ ఉన్న సమయంలో నటించలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడం వల్ల తెలుగు సినిమా లకు ఓకే చెబుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..ఇక ముందు అయిన ఈ అమ్మడు ముందు అయిన మంచి ఆఫర్లను అందుకుంటుందే చూడాలి..ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయితే మాత్రం ఆపడం కష్టమే.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది..ఆమె తల్లి లాగా స్టార్ అవుతుందో లేదో చూడాలి మరి..